లారీల నిరవధిక సమ్మె
కోవూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ అక్టోబరు 1వ తేదీ నుంచి ఆలిండియా లారీల నిరవధిక సమ్మె చేస్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలనాయుడు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లారీల రవాణా ద్వారా మన ప్రభుత్వానికి రూ.కోట్లు ఆదాయం వస్తోందన్నారు.
పెట్రోలు ధర తగ్గించాలి.. పెట్రోలు ధరలను దేశంలో ఎక్కడ లేని విధంగా మనరాష్ట్రంలో లీటరుకు రూ.4 అధికంగా ఉందని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాలకృష్ణ , జిల్లా ప్రధానకార్యదర్శి రవికుమార్ అన్నారు. అక్టోబర్ 1 నుంచి పెట్రోలు బంకుల నిరవధిక బంద్ జరుగుతుందన్నారు.