డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ నెలలో డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరను ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 8.60 డాలర్లు (రూ.715) నుంచి 9.20 డాలర్లు (రూ.765) కు పెంచింది.
2023 అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ మధ్య కాలానికి దేశీయ సహజ వాయువు ధరను పెంచినట్లు తెలియజేస్తూ కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎన్‌జీ ధరలపై ప్రభావం
ప్రభుత్వం డొమెస్టిక్ నేచురల్ గ్యాస్‌ను పెంచడంతో గ్యాస్ పంపిణీ సంస్థలు సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను పెంచే అవకాశం ఉంది. నేచురల్ గ్యాస్ అనేది శిలాజ ఇంధనం. దీన్ని పలు పారిశ్రామిక అవసరాలతోపాటు వంట గ్యాస్ గానూ ఉపయోగిస్తారు.
వరుసగా రెండో నెల
డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధర పెంచడం ఇది వరుసగా రెండో నెల. సెప్టెంబర్‌లో ఈ గ్యాస్ ధర ఒక మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (mmBtu)కు 7.85 డాలర్ల నుంచి 8.60 డాలర్లకు పెరిగింది. ఇప్పుడు అక్టోబర్‌లోనూ 8.60 డాలర్ల నుంచి 9.20 డాలర్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment