సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టుల్లో 2022 జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కేటగిరీల్లో ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చే కేసులు/పిటిషన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి కానుంది. ఆ తేదీ తర్వాత ఏ విషయంలోనూ ప్రభుత్వం భౌతికంగా కేసులు వేయడానికి వీలులేదు.
రెవెన్యూ, పన్ను, మధ్యవర్తిత్వం, వాణిజ్య వివాదాలు, హైకోర్టు ద్వారా సాగే ఇతర కేటగిరీల్లో అందరికీ ఈ–ఫైలింగ్ తప్పనిసరి చేయాలి. అంతేగాక సబార్డినేట్ కోర్టుల తీర్పులు/ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్లు, అప్పీళ్లు, రివిజన్లకు ఈ–ఫైలింగ్ తప్పనిసరి. డబ్బు రికవరీ సూట్లు (బ్యాంకుల ద్వారా రుణ రికవరీ సూట్లు, అద్దె బకాయిలు మొదలైనవి), నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఫిర్యాదులు, నిర్వహణ కోసం దరఖాస్తులు, పరస్పర అంగీకారం ద్వారా విడాకుల పిటిషన్‌లు, బెయిల్ దరఖాస్తులను కూడా ఈ–ఫైలింగ్ ద్వారానే స్వీకరిస్తారు. (సమాచారం: ఐక్యతా శిల్పం సందర్శన ఐదు రోజులపాటు నిలిపివేత)
Comments
Please login to add a commentAdd a comment