ఢిల్లీ: భార్యాభర్తల విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడం సాధారణమైన విషయం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో భరణం గురించి సుప్రీంకోర్టు విధివిధానాలు వెలువరించింది. ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీవీ వర్లేల ధర్మాసనం.. భరణం కింద ఇచ్చే నగదు గురించి మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాల ఆధారంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు విడాకుల కేసుల్లో భరణం నిర్ణయించాలని సూచించింది.
ఎనిమిది మార్గదర్శకాలు ఇవే..
1. భార్యాభర్తల సామాజిక ఆర్ధిక స్థితిగతులు.
2. భవిష్యత్తులో భార్య, పిల్లల ప్రాథమిక అవసరాలు.
3. ఇరు పార్టీల ఉద్యోగ- విద్యార్హతలు, ఆదాయం-ఆస్తులు.
4. ఆదాయం మరియు ఆస్తి సాధనాలు.
5. అత్తింట్లో ఉన్నప్పుడు భార్య జీవన ప్రమాణం.
6. కుటుంబం కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా?.
7. ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి తగిన మొత్తం.
8. భర్త ఆర్దిక పరిస్థితి అతడి ఆదాయాలు, భరణం సహా ఇతర బాధ్యతలు.
ఇదిలా ఉండగా.. తన భార్య పెట్టిన వేధింపులు భరించలేక బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ బలవనర్మణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
భరణం విషయంలో ఎనిమిది అంశాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. విడాకుల సమయంలో శాశ్వత భరణం నిర్ణయించడానికి ఇవి సాధారణమైనవి కాదని, చాలా కీలకమైనవని వ్యాఖ్యానించింది. తన భార్య నిఖిత సింఘానియా విడాకుల సమయంలో రూ.3 కోట్లు ఇవ్వాలని, నెలకు రూ. 2లక్షలు భరణం కావాలని డిమాండ్ చేసినట్టు అతుల్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: భర్త సుభాష్ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్ ఏంటంటే..
ఇది కూడా చదవండి: భర్తపై వ్యక్తిగత పగతో వైవాహిక చట్టాల దుర్వినియోగమా?.. సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment