ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది.
125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment