సాక్షి, న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో మదుపు చేసే సబ్‌స్క్రైబర్లు తప్పనిసరిగా ఆధార్ వివరాలు ఇవ్వాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) స్పష్టం చేసింది. సబ్‌స్క్రైబర్ల ఆధార్ కార్డు నెంబర్‌ను కోరుతూ పీఎఫ్‌ఆర్‌డీఏ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫాంలో మార్పులు చేసింది. 2018 జనవరి 1 నుంచి ఏపీవైకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ పీఎఫ్‌ఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి 1 నుంచి సవరించిన దరఖాస్తు ప్రకారం ఏపీవై ఫాంను పూర్తి చేయాలని సర్వీస్ ప్రొవైడర్లందరికీ సమాచారం పంపింది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ అవసరాల కోసం మోదీ సర్కార్ 2015 మేలో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతి సబ్‌స్క్రైబర్ 60 ఏళ్లు నిండిన అనంతరం కనీస నెలవారీ ఫించన్‌ను అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment