సాక్షి, చెన్నై : నీట్ ఎగ్జామినేషన్‌ను వ్యతిరేకిస్తూ చెన్నైలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నగరంలోని అన్నానగర్‌లో సీబీఎస్‌ఈ జోనల్ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు హజరయ్యారు. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం సీబీఎస్‌ఈ నీట్ పరీక్షను నిర్వహించింది. 13 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకున్నారని, దేశమంతటా 2,225 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించామని సీనియర్ సీబీఎస్‌ఈ అధికారి వెల్లడించారు.
దరఖాస్తులు పెద్దసంఖ్యలో రావడంతో ఈ ఏడాది అదనంగా 43 నూతన కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నీట్ అభ్యర్థులకు మెరుగైన ఏర్పాట్లు చేసినప్పటికీ తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలకు అభ్యర్ధుల హాజరు తక్కువగా ఉందని అన్నారు. నీట్ కేంద్రాల వద్ద అధికారులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించే క్రమంలో అభ్యర్ధుల డ్రెస్ కోడ్‌పై అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థినులను హెయిర్ పిన్స్, ఆభరణాలు, షూస్‌ను తీసివేయాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో 4000 మంది పరిశీలకును నియమించారు. దాదాపు 1,20,000 మంది ఇన్విజిలేటర్లను రంగంలో దించారు.
Comments
Please login to add a commentAdd a comment