CM Stalin Stops to Meet Student: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం ఎంకే స్టాలిన్ తనదైన పాలనతో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో చెన్నైలోని టీటీకే రోడ్‌లో ఓ యువకుడు 'సీఎం సార్ హెల్ప్ మీ' అంటూ ప్లకార్డును పట్టుకుని నిల్చొని ఉండగా, దీనిని గమనించిన సీఎం స్టాలిన్ తన కారును ఆపి ఆ యువకుడితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్ సతీష్ దేశమంతటా నీట్ మినహాయింపులు తీసుకు వచ్చేలా చూడాలని సీఎం స్టాలిన్‌ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని డీఎంకే ప్రభత్వుం నీట్ రద్దు కోసం చర్యలను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: (Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి కోటి రూపాయలతో పరార్)
மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள், தலைமைச் செயலகம் வரும் வழியில் டி.டி.கே சாலையில், ஆந்திர மாநிலம் கிழக்கு கோதாவரி மாவட்டத்தைச் சேர்ந்த மாணவர் திரு. என்.சதிஷ், “CM SIR HELP ME” என்ற பதாகையுடன் நின்றிருந்ததை பார்த்து, அவரை சந்தித்துப் பேசினார்.
— CMOTamilNadu (@CMOTamilnadu) February 3, 2022
1/2 pic.twitter.com/279k8ilq8g
Comments
Please login to add a commentAdd a comment