సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ ద్వారా జాతీయస్థాయిలో 15% పశు వైద్య సీట్లను భర్తీ చేస్తామని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) తెలిపింది. ఈ మేరకు వీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. జాతీయస్థాయిలో ఉండే ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలోని బీవీఎస్సీ సీట్లలో 15% నేషనల్ పూల్ కింద కేటాయించారు. వాటిలో సీటు పొందేందుకు గతంలో వీసీఐ పరీక్ష రాస్తే సరిపోయేది.
కానీ, గతేడాది నుంచి వాటిని నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఆ 15% సీట్లకు పోటీ పడేందుకు విద్యార్థులు నీట్ రాస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 150 బీవీఎస్సీ సీట్లలో నేషనల్ పూల్ పరిధిలోకి వెళ్లిన 15% సీట్లను మినహాయిస్తే, మిగిలిన 85% సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
‘నీట్’ ద్వారా 15 శాతం పశువైద్య సీట్ల భర్తీ
Published Fri, Mar 2 2018 12:53 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment