Veterinary College
-
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
చినబాబు స్కీం రూ. 300 కోట్ల స్కాం
విజయవాడ: రాజధానిలో మరో భూ పందేరానికి తెరలేచింది. రూ.300 కోట్ల విలువైన భూమిని తమ అస్మదీయ కంపెనీకి కట్టబెట్టేందుకు చినబాబు డైరెక్షన్లో రంగం సిద్ధమైంది. దీంతో చేసేది లేక అధికారులు గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల స్థలాన్ని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేయడానికి చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ స్థలం ఇవ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పేర్కొంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ వెటర్నరీ కశాశాలకు ప్రభుత్వం విడతల వారీగా 125 ఎకరాలు కేటాయించింది. ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తోంది. లైవ్‌స్టాక్ యూనిట్ కోసం కేసరపల్లిలో ఆర్ఎస్ నెం.20లో ఉన్న 66 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమిని ప్రభుత్వం 1994లో ఈ కళాశాలకు కేటాయించింది. ఇక్కడ వెటర్నరీ యూనివర్సిటీ వారు లైవ్‌స్టాక్ యూనిట్, రెండు ఫిష్ ట్యాంకులు, గుర్రాలశాల, పశువుల షెడ్లు నిర్మించారు. ఇప్పుడీ స్థలంపైనే చినబాబు కన్నుపడింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలాన్ని వెనక్కు తీసుకుని.. తిరిగి దానిని ఓ ఐటీ కంపెనీకి ధారాదత్తం చేసేందుకు స్కెచ్ వేశారు. చినబాబు నిర్ణయానికి అనుగుణంగా ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరుతూ సదరు ఐటీ సంస్థ రెవెన్యూ శాఖకు విజ్ఞప్తి చేసింది. వెంటనే చిన్నబాబు నుంచి రెవెన్యూ, వెటర్నరీ యూనివర్సిటీ అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లడం.. ఫైళ్లు చకచకా కదలడం ప్రారంభమైపోయింది. చినబాబు ఒత్తిడితో మెత్తబడిన అధికారులు.. వెటర్నరీ కళాశాలకు చెందిన 66 ఎకరాల భూమిని ఐటీ కంపెనీకి కట్టబెట్టాలని చినబాబు నుంచి జిల్లా యంత్రాంగానికి రెండు నెలలుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. దాంతో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం రంగప్రవేశం చేసి దానిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయమై కిందిస్థాయి అధికారులతో చర్చించారు. వారు యూనివర్సిటీ అధికారులతో చర్చించినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఆ స్థలాన్ని ఐటీ కంపెనీకి ఇవ్వాలని.. ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి స్థలం కేటాయిస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, ఆ స్థలాన్ని వదిలిపెట్టేందుకు వెటర్నరీ అధికారులు విముఖత వ్యక్తంచేశారు. ఈ క్రమంలో చినబాబు యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి పెంచారు. దాంతో చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని అప్పగించేందుకు యూనివర్సిటీ అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ విషయం బయటకు పొక్కితే కళాశాల విద్యార్థులు ఆందోళన చేస్తారనే భయంతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని గోప్యంగా స్వాధీనం చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎకరం రూ.4కోట్లు కాగా, జాతీయ రహదారి, విమానాశ్రయం, ఐటీ పార్కు పక్కనే ఉన్న ఈ భూమి పరిసర ప్రాంతాల్లోని ఆర్ఎస్ నెం.14, 15, 16 సర్వే నెంబర్లలో ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అంటే సుమారుగా ఆ భూమి విలువ రూ.300కోట్లు. అలాగే.. ప్రభుత్వ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ రికార్డులలో ఎకరం రూ.1,57,75,000గా ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఇక్కడ ఎకరం రూ.10కోట్లు పలికింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఎకరం కనీసం రూ.4కోట్లకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ స్థలం మాదిరిగా లాక్కునే యత్నం మరోవైపు.. వెటర్నరీ కాలేజీ స్థలం 66 ఎకరాలకు ఆనుకుని ఆర్టీసీ ఆధీనంలో ఉన్న 28 ఎకరాలను రెవెన్యూ అధికారులు కొద్దినెలల క్రితం ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. ఆర్జీసీ జోనల్ డ్రైవింగ్ శిక్షణా కళాశాల నడుస్తున్న ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్‌సీఎల్‌కు అప్పగించారు. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించుకునేందుకు ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం ఇస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో దానిని తాత్కాలికంగా భవానీపురానికి తరలించారు. ఈ స్థలంలోనే సోమవారం రాష్ట్ర ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ ఐటీ సంస్థలకు భూమి పూజచేశారు. ఇదిలా ఉంటే.. రెవెన్యూ అధికారులు ఆర్టీసీకి ప్రత్యామ్నాయంగా ఎందుకూ పనికిరాని కొండగట్లు చూపిస్తుండటం కొసమెరుపు. -
‘నీట్’ ద్వారా 15 శాతం పశువైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ‘నీట్’ ద్వారా జాతీయస్థాయిలో 15% పశు వైద్య సీట్లను భర్తీ చేస్తామని వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) తెలిపింది. ఈ మేరకు వీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. జాతీయస్థాయిలో ఉండే ప్రభుత్వ వెటర్నరీ కాలేజీలోని బీవీఎస్సీ సీట్లలో 15% నేషనల్ పూల్ కింద కేటాయించారు. వాటిలో సీటు పొందేందుకు గతంలో వీసీఐ పరీక్ష రాస్తే సరిపోయేది. కానీ, గతేడాది నుంచి వాటిని నీట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. రాష్ట్రంలోనూ ఆ 15% సీట్లకు పోటీ పడేందుకు విద్యార్థులు నీట్ రాస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 150 బీవీఎస్సీ సీట్లలో నేషనల్ పూల్ పరిధిలోకి వెళ్లిన 15% సీట్లను మినహాయిస్తే, మిగిలిన 85% సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. -
మూడేళ్లుగా ఖాళీగా వీసీ పోస్టు
-
ఈ సారి నిరాశే..
వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలు లేవు అనుమతి నిరాకరించిన కౌన్సిల్ చివరి నిమిషంలో మార్పులు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం సాక్షి, హన్మకొండ : వరంగల్ వెటర్నరీ కళాశాలలో తరగతుల ప్రారంభానికి మరో ఏడాది పాటు ఎదురుచూడక తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వెటర్నిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించింది. అడ్మిషన్ల నిర్వహణకు తగిన సమయం లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి వరంగల్ నగరంలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరిలో స్వయంగా ప్రకటించారు. అనంతరం ఏర్పాట్లలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు గత జూలై 23న వరంగల్‌లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు, సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. కాలేజీ నిర్వహణకు 87 మంది బోధన, 205 మంది బోధనేతర సిబ్బందిని కేటాయించారు. కళాశాల ఏర్పాటుకు హన్మకొండ మండలం మామునూరు సమీపంలోని పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర మత్స్య శాస్త్ర విశ్వవిద్యాలయం, పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలు ఉంటాయని అందరూ ఆశించారు. ఆలస్యంగా ప్రకటన.. వెటర్నరీ కాలేజీ ఏర్పాటుపై వేగంగా నిర్ణయం తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. 2016–17 విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ.. స్థల సేకరణ పనులే జూలై వరకు కొనసాగాయి. దీంతో కాలేజీ ఏర్పాటుపై ప్రభుత్వం ఆలస్యంగా(జూలై 23న) ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే మెడికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పూర్తయింది. ప్రవేశాల కౌన్సెలింగ్ మాత్రం జరగలేదు. ఎలాగైనా ఈ ఏడాది నుంచే ప్రవేశాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. అడ్డు తగులుతున్న సాంకేతిక కారణాలు... వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలంటే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన తర్వాత కౌన్సిల్ బాధ్యులు కళాశాలలో టీచింగ్ స్టాఫ్, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలి. దీనంతటికీ కనీసం రెండు నెలలు పడుతుంది. జూలైలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బాధ్యులు వరంగల్ కాలేజీ ప్రవేశాలపై ^è ర్చించారు. అయితే ఎంసెట్ నోటిఫికేషన్లో ఈ కళాశాల పేరు లేకపోవడం ప్రధాన సాంకేతిక సమస్యగా మారింది. అంతేకాక కాలేజీ నిర్వహణకు మౌలిక సదుపాయాలు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి నిరాకరించింది. ఈ మేరకు త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. -
పశు వైద్య కళాశాల మంజూరుపై హర్షం
మామునూరు : హన్మకొండ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో పశు వైద్యకళాశాల ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి.జయశంకర్, డానియల్, రమేష్, అనంత్, బాబు, శ్రీశైలం, కుమార్, హన్మన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పశువైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
మామునూరులో ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ఎఫెక్ట్ సాక్షి, హన్మకొండ : వరంగల్‌లో పశువైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ మండలం మామూనూరు సమీపంలో వెటర్నరీ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. నిర్వాహణ కోసం 87 మంది టీచింగ్ స్టాఫ్, 205 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు రూ.208 కోట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది, నిధులకు సంబంధించి త్వరలో నిర్ణయం వెలువరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వరంగల్ నగరాన్నిSఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్ నగరంలో పశు వైద్య కళాశాలను నెలకొల్పుతామన్నారు. ఇచ్చిన హామీకి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మామునూరు సమీపంలో ఉన్న పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణంలో వెటర్నరీ కాలేజీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. -
వెటర్నరీ కాలేజీలో ప్రవేశాలు సందిగ్ధమే
స్థలం చూశారు.. పనులు మరిచారు నిధులు మంజూరైనా వీడని నిర్లక్ష్యం? శంకుస్థాపనకు కూడా నోచుకోని కళాశాల సాక్షి, హన్మకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 జనవరిలో జిల్లాలో పర్యటించిన సందర్భంగా వరంగల్ నగరాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని ప్రకటించారు. కాటన్ రీసెర్చ్ సెంటర్, వెటర్నరీ, అగ్రికల్చర్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీ, మేనేజ్మెంట్ స్కూల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలను వరంగల్‌లో నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. ఇందులో వెటర్నరీ, వ్యవసాయ కళాశాలలను 2016–17 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో జిల్లా యంత్రాంగం అగ్రికల్చర్, పశు వైద్య కాలేజీల ఏర్పాటుకు ఆగమేఘాల మీద స్థల సేకరణ ప్రారంభించింది. పీ.వీ.నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు సంవర్థక విశ్వవిద్యాలయానికి(హైదరాబాద్) అనుబంధంగా హన్మకొండ మండలం మామునూరు సమీపంలో ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ క్యాంపస్‌లో 128 ఎకరాల స్థలాన్ని వెటర్నరీ కళాశాల కోసం గుర్తించారు. ఈ స్థలాన్ని వెటర్నరీ కళాశాలకు కేటాయించాలంటూ మార్చిలో రెవెన్యూ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. ముందుకు సాగని పనులు.. 2016–17 విద్యాసంవత్సరం నుంచి వెటర్నరీ కాలేజీలో తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ పీ.వీ.నరసింహరావు పశుసంవర్థక యూనివర్సిటీ రిజిస్ట్రార్ కొండల్‌రెడ్డికి నాలుగు నెలల క్రితం డిప్యూటీ సీఎం కడియం సూచించారు. పశు వైద్యకళాశాల శంకుస్థాపన, భవన నిర్మాణ పనులను ఆర్నెళ్లలోలోపు పూర్తయ్యేలా పనులు చేపట్టాలని ఆదేశించారు. అయితే నాలుగు నెలలు గడిచినా వెటర్నరీ కాలేజీ పనులు ముందుకు సాగడం లేదు. ఇంత వరకు భవన నిర్మాణ పనులకే శంకుస్థాపన చేయలేదు. ఈ అంశంపై స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్, ప్రభుత్వ సలహాదారు పాపారావు రెండోసారి స్థల పరిశీలన చేశారు. కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలంటూ సంబంధిత అధికారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిధులు కేటాయింపు విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు వరంగల్ వెటర్నరీ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.207 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మొదటి ఏడాది 30 సీట్లతో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కాలేజీ కోసం 143 పోస్టులు కూడా మంజూరు చేసినటు తెలుస్తోంది. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఈ ఏడాది నుంచి పశువైద్య కాలేజీలో ప్రవేశాలు కల్పించేలా జిల్లా అధికారులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. -
పందెపు గిత్తలకు సుగర్ ముప్పు!
♦ అధిక శ్రమ, ఒత్తిడే కారణం ♦ పశువైద్య నిపుణుడు డా. సుధాకర్‌రెడ్డి కృషితో వెలుగు చూసిన వైనం మధుమేహం (డయాబెటిస్) అనగానే మనుషులకు వచ్చే వ్యాధిగానే పరిగణించటం సహజం. కానీ పశువులక్కూడా ఈ వ్యాధి వస్తుందనే సంగతి ఓ పశువైద్య నిపుణుని కృషితో దేశంలోనే తొలిగా వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డా. భవనం సుధాకర్‌రెడ్డి అధిక వత్తిడికి గురయ్యే పశువులు మధుమేహం బారిన పడుతున్నట్టు కనుగొన్నారు. లూథియానాలో 2 నెలల క్రితం జరిగిన భారతీయ పశువైద్య మండలి సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రానికి ఆయనకు అవార్డు కూడా వచ్చింది. ఒంగోలు జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన భవనం సుధాకర్‌రెడ్డి తిరుపతిలోని పశు వైద్య విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశారు. 2012 నుంచి ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో సహాయ ఆచార్యులుగా పని చేస్తున్నారు. బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎడ్లు బలహీన పడి, బరువు తగ్గుతుండటంతో వాటి యజమానులు ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు తీసుకొస్తూ ఉంటారు. ఎడ్ల మూత్రం, రక్తాన్ని పరీక్షించిన ఆయన మధుమేహం పాలైనట్లు గుర్తించారు. పశువుల మూత్రాన్ని పరీక్షించగా.. ఆరోగ్యవంతమైన పశువుల్లో ఉదజని సూచిక (పీహెచ్) స్థాయి 7-9 వరకు ఉంది. మధుమేహం సోకిన పశువుల్లో 5-6కు పడిపోయింది. తెల్ల రక్తకణాలు, కీటోన్ బాడీస్, చక్కెర స్థాయిలు కూడా అధికంగా ఉన్నట్టు తేలింది. అధిక శారీరక శ్రమ, హార్మోన్లలో అసమతుల్యత, స్టెరాయిడ్స్ వాడకం వంటి కారణాల వల్ల పశువులు మధుమేహానికి గురవుతున్నాయని డా. సుధాకర్‌రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎడ్లు మధుమేహం బారిన పడే అవకాశాలు అధికం. వాటికయ్యే గాయాలు, నొప్పులను తగ్గించేందుకు ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ మోతాదుకు మించి వాడ టం కూడా ఈ వ్యాధి కి దారితీస్తోందని ఆయన అంటున్నారు. వైరల్ జ్వరాలతో పేగులు దెబ్బతిన్నా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. చక్కెర స్థాయిల్లో అసమతుల్యత వల్ల కీటోన్ బాడీస్ పెరిగి పశువులు పిచ్చిగా ప్రవర్తిస్తాయి. బరువు కూడా తగ్గుతాయి. నీరు ఎక్కువగా తాగుతూ తరచూ మూత్ర విసర్జన చేస్తాయి. మూత్రం బెల్లం రంగులో ఉండి, కొంచెం జిగటగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి నరాల బలహీనత ఏర్పడుతుంది. అప్పుడు మనుషుల్లాగే పశువులకు కూడా ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మధుమేహం సోకిన పశువులకు చికిత్స చేయటం ప్రయాసతో కూడుకున్న పని. ఇది వైద్యుడి పర్యవేక్షణలోనే జరగాలి. - కె.వీరారెడ్డి, ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప జిల్లా ముందు జాగ్రత్తే మేలు.. పశువులను ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకూడదు. అవసరం లేకున్నా స్టెరాయిడ్స్ వాడ కూడదు. పశువుల రక్తం, మూత్రంలో చక్కెర పరీక్షలు చేయించటం ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. వ్యాధి వచ్చాక బాధపడేకంటే ముందు జాగ్రత్తలు పాటించటం మేలు. - డా. భవనం సుధాకర్‌రెడ్డి (90302 18657), సహాయ ఆచార్యులు (ఔషధ విభాగం), పశువైద్య కళాశాల, ప్రొద్దుటూరు, వైఎస్సార్ కడప జిల్లా -
వరంగల్‌లో వెటర్నరీ కాలేజీకి సీఎం కేసీఆర్ ఓకే
హైదరాబాద్: వరంగల్‌లో వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. కాలేజీ ఏర్పాటుకు ముందు వెటర్నరీ కాలేజీ ఆఫ్ ఇండియా (వీసీఐ) అనుమతి అవసరం. అందుకోసం వీసీఐకి లేఖ రాసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా గురువారం ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో దాదాపు 30 వెటర్నరీ సీట్లు వరంగల్‌కు వచ్చే అవకాశం ఉంది. సీట్ల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలావుండగా ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటుపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల సమీపంలో ఏర్పాటు చేయాలా? లేకుంటే ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయాలా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఫిషరీస్ సైన్స్ కాలేజీపై ఆయా జిల్లాల మంత్రులు తమకంటే తమకంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరు చేసినందున ఖమ్మం జిల్లాకే వెటర్నరీ కాలేజీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సీఎం తీసుకునే నిర్ణయంపైనే ఏ జిల్లాకనేది స్పష్టత వస్తుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేజ్ కల్చర్‌పై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించడంతో ఫిషరీస్ సైన్స్ కాలేజీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
వరంగల్‌లో వెటర్నరీ కాలేజి
హైదరాబాద్ : వరంగల్‌లో వెటర్నరీ కాలేజీ ఏర్పాటు చేయాలని పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కాలేజీ ఏర్పాటుకు ముందు వెటర్నరీ కాలేజీ ఆఫ్ ఇండియా (వీసీఐ) అనుమతి అవసరం. అందుకోసం వీసీఐకి లేఖ రాసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా 'సాక్షి'కి చెప్పారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచే వెటర్నరీ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 30 వెటర్నరీ సీట్లు వరంగల్‌కు వచ్చే అవకాశం ఉంది. కాగా ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఏర్పాటుపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కాలేజీని మహబూబ్‌నగర్ జిల్లా జూరాల సమీపంలో ఏర్పాటు చేయాలా? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేయాలా? అన్నది తేలలేదు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరు చేసినందున ఖమ్మం జిల్లాకే ఫిషరీస్ సైన్స్ కాలేజీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. -
నెరవేరిన వైఎస్ ఆశయం
ప్రొద్దుటూరు : పాడి పరిశ్రమతోపాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల నేటి పరిస్థితుల్లో నిజంగా వరంగా మారిందని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజేంద్ర నగర్, గన్నవరం, తిరుపతిలో మాత్రమే పశువైద్య కళాశాలలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా కొత్త కళాశాలలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. పైగా పశువైద్య శాస్త్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. చదువు పూర్తవుతూనే ఉద్యోగాలు వస్తుండటంతో చాలా మంది తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలలోని కళాశాలల్లో చదివించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న హయాంలో అటు కరీంనగర్ జిల్లా కోరుట్లతోపాటు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో కూడా 2008 విద్యా సంవత్సరం నుంచి పశువైద్య కళాశాలను ప్రారంభించారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఐదు పశువైద్య కళాశాలలు ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మూడు కళాశాలలు ఉన్నాయి. విజయవాడ సమీపంలోని గన్నవరంతోపాటు తిరుపతి, ప్రొద్దుటూరులలో ఈ కళాశాలలు ఉన్నాయి. రాయలసీమ కంతటికీ తిరుపతి, ప్రొద్దుటూరులలో మాత్రమే ఈ కళాశాలలు ఉన్నాయి. 2008 నుంచి ప్రారంభం వైఎస్ సీఎంగా ఉన్న హయాంలో నగర బాట కార్యక్రమంలో భాగంగా 2008 ఆగస్టు నెలలో ప్రొద్దుటూరుకు వచ్చారు. స్థానిక రాజీవ్ సర్కిల్లో ప్రొద్దుటూరుకు పశువైద్య కళాశాలతోపాటు యోగివేమన ఇంజ నీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికప్పుడు వేగంగా పనులు ప్రారంభించి అదే ఏడాది అక్టోబర్‌లో పశువైద్య కళాశాలను ప్రారంభించారు. మొత్తం రూ.125 కోట్లతో కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. వైఎస్ హయాంలోనే తొలివిడతగా మెయిన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.24కోట్లు నిధులు కేటాయించారు. 26 జూన్, 2010న అప్పటి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పార్థసారథి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆ మేరకు ఏడాదిలోపు పనులు పూర్తి కావలసి ఉన్నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కళాశాల నిర్మాణంపై శ్రద్ధ చూపకపోవడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం మెయిన్ బిల్డింగ్తోపాటు టీచింగ్ వెట ర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, డెయిరీ ఫాం, బాలుర, బాలి కల హాస్టళ్ల నిర్మాణాలతోపాటు పోస్టుమార్టం విభాగాన్ని నిర్మించారు. కళాశాల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా డబుల్ రోడ్లు నిర్మించడంతోపాటు రోడ్డు మధ్యన బటర్‌ఫ్లై, హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు. పశువైద్య విద్యకు సంబంధించి ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఆడిటోరియం, స్టాఫ్ క్వార్టర్స్ తదితర వాటిని మాత్రమే నిర్మించాల్సి ఉందని సమాచారం. ఆలస్యంగా వీసీఐ గుర్తింపు 2008లో కళాశాల ఏర్పాటైనా వైఎస్ మరణానంతరం పనులు పూర్తికాకపోవడం, సిబ్బంది కొరత తదితర సమస్యల కారణంగా కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించలేదు. వీసీఐ హెచ్చరికలతో యూనివర్సిటీ అధికారులు కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేశారు. దీంతో కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది. కళాశాల ప్రారంభమైన తర్వాత 2013లో ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులు బయటికి వెళ్లారు. మొత్తం 31 మందిలో హరిప్రసాద్ రాజు అనే విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించగా, మరో విద్యార్థికి మాత్రమే జాబ్ రాలేదు. మిగత 29 మంది వెటర్నరీ డాక్టర్లుగా నియమితులయ్యారు. గత ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు పీజీలో చేరి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో 30 అడ్మిషన్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది 60 మందికి పెంచారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్ల సంఖ్య 75కు పెరగడంతోపాటు ముందుముందు కళాశాలలో పీజీని ఏర్పాటు చేస్తారని కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కళాశాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జిల్లాలోని పశువైద్యాధికారులకు శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కళాశాల పూర్తి హంగులతో రూపుదిద్దుకోవడంతో వైఎస్ కల నెరవేరినట్లుయింది. నేడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభం నూతనంగా నిర్మించిన పశువైద్య కళాశాలను మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల మెయిన్ బిల్డింగ్తోపాటు టీచింగ్ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్, బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించనున్నారు. -
వెటర్నరీ కళాశాలపై సర్కార్ కన్ను
వెటర్నరీ కాలేజీలో సచివాలయం ఏర్పాటుకు కసరత్తు! గుట్టుగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం కళాశాలను గుంటూరుకు తరలిస్తారని ప్రచారం ఆందోళనలో అధ్యాపకులు, విద్యార్థులు విజయవాడ : ఒకవైపు విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు నెలకొల్పుతామని చెబుతున్న పాలకులు.. మరోవైపు ఉన్న ప్రతిష్టాత్మక కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తు చేయడం విడ్డూరంగా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీని మంగళగిరికి తరలిస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలపై ప్రభుత్వం కన్ను పడినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టుకు, ఐటీ పార్కుకు మధ్యలో అసెంబ్లీని తలపించేలా భవన సముదాయం ఉన్న ఈ కళాశాలను మరో ప్రాంతానికి తరలించి ఇక్కడ సెక్రటేరియేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో కళాశాల వర్గాలు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెటర్నరీ కళాశాల క్యాంపస్‌ను త్వరలో నిర్మించే రాజధానిలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సీఎం దృష్టిలో పడిందిలా.. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జాతీయ రహదారి పక్కనే సుందరంగా ఉన్న వెటర్నరీ కళాశాల భవన సముదాయం కనిపించింది. ఆయన పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులతో ఈ భవనం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే సచివాలయం ఏర్పాటుకు పరిశీలించాలని సూచించినట్లు సమాచారం. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో గన్నవరంలో వెటర్నరీ కళాశాలను 1998లో ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఒకప్పటి బేకన్ ఫ్యాక్టరీలో సుమారు 25 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించారు. ఇక్కడ దాదాపు వందకుపైగా గదులు ఉన్నాయి. కళాశాలకు అతి దగ్గరలో మరో 30 ఎకరాల్లో దాదాపు 25 వేల చదరపు అడుగుల్లో మూడు ఆంతస్తుల అప్మెల్ భవనం, ఖాళీ స్థలం వెటర్నరీ కళాశాల ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలంలో విద్యార్థులకు అవసరమైన పౌల్ట్రీఫారం, పశుగ్రాసం పెంపపం వంటివి చేపట్టారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 328 మంది బీవీఎస్ఈ విద్యార్థులు, 28 మంది పీజీ, ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలకు అనుబంధంగా గన్నవరంలో బోధనాస్పత్రి ఉంది. వెటర్నరీ కళాశాల తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం ధరలు పెరిగినందున రాజధాని కోసం భూముల సేకరణ కష్టం కావడంతో ప్రస్తుతం వెటర్నరీ కళాశాలతోపాటు ఖాళీగా ఉన్న 30 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెటర్నరీ కళాశాలను ప్రత్నామ్నాయంగా గుంటూరు జిల్లాకు తర లిస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. -
పశువైద్య కళాశాలను తనిఖీ చేసిన వీసీఐ బృందం
ప్రొద్దుటూరు: స్థానిక ప్రభుత్వ పశువైద్య కళాశాలను దక్షిణ భారత పశువైద్య మండలి (వీసీఐ) బృందం గురువారం సందర్శించింది. కళాశాల నడుస్తున్న భవనాలతోపాటు గోపవరం సమీపంలో నిర్మించిన నూతన భవనాలను పూర్తిగా పరిశీలించారు. జంతువధశాల, దాణా కేంద్రం, చికిత్స, బోధనశాలలు, కోళ్ల, పశుపెంపకాలతోపాటు అన్ని డిపార్ట్మెంట్లలో తిరిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ అంశాలపై కళాశాల డీన్ జగదీశ్వరరావుతో చర్చించారు. అధ్యాపకులు తగినంత మంది ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. 2008లో ప్రారంభించిన ఈ కళాశాలకు ఇప్పటి వరకు వీసీఐ గుర్తింపు లేదు. దీంతో కళాశాల మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో వసతులను పరిశీలించేందుకు ప్రస్తుతం వీరు ఇక్కడికి వచ్చారు. వీసీఐ బృందంలో కలకత్తాకు చెందిన డాక్టర్ గోస్వామి, మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ పురియా, హర్యానా రాష్ట్రానికి చెందిన రాజేష్‌కుమార్ ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు ఆనందరెడ్డి, జగపతిరామయ్య, రవీంద్రారెడ్డి, వరప్రసాదరెడ్డి, సురేష్‌కుమార్, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. వీసీఐ బృందం మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటుందని తెలియవచ్చింది. -
త్వరలో 3 ప్రాంతీయ వ్యవసాయ వర్సిటీలు?
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మూడు ‘వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు’ ఏర్పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రాజేంద్రనగర్ కేంద్రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలున్నాయి. అయితే తాజా మార్పుల మేరకు ఈ విశ్వవిద్యాలయాలను ప్రాంతీయ వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేసి, వాటి పరిధిలోకి వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సులను తేవాలన్న ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం మరో నెలలో తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రాష్ట్రంలో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కటే ఉండేది. ఈ విశ్వవిద్యాలయ పరిథిలోనే వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలలు ఉండేవి. దివంగత నేత వైఎస్ హయాంలో ఉద్యాన, పశువైద్య విద్యల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వీటికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి కేంద్రంగా పశువైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు. నిన్న మొన్నటి దాకా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పూర్తికాలం వైస్‌ఛాన్సలర్ లేరు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి ఇప్పటికీ పూర్తికాలం వీసీని నియమించలేదు. వైఎస్ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోరుట్ల, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన గురించీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ కారణంగా ఈ కాలేజీల గుర్తింపే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో అరకొర వసతులు, బొటాబొటి సౌకర్యాలతో ప్రత్యేక యూనివర్సిటీలను నిర్వహించడం కన్నా ఈ మూడింటినీ ప్రాంతీయ విశ్వవిద్యాలయాలుగా మార్చి.. వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య శాఖలను విలీనం చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎన్జీరంగా యూనివర్సిటీ వీసీ నేతృత్వంలో మూడు విశ్వవిద్యాలయాల ప్రతినిథులతో నిపుణుల కమిటీని మూడు నెలల క్రితం ప్రభుత్వం నియమించింది. అయితే, వ్యవసాయ, ఉద్యాన శాఖల నిపుణులు సుముఖంగా ఉన్నా పశువైద్య విభాగం నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలిసింది. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం ‘చెక్కు’ను అందచేసేందుకు ఇటీవల ఎన్జీరంగా వీసీ పద్మరాజు ఆధ్వర్యంలో యూనివర్సిటీ అధికారులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ‘ప్రాంతీయ విశ్వవిద్యాలయాల’ ప్రతిపాదనపై వీసీని వాకబు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వీసీ పశువైద్య విభాగం వారు ఈ ప్రతిపాదనలకు అంత సుముఖంగా లేరని సీఎంకు తెలిపారు. ‘మీ కమిటీ రిపోర్టు ఇవ్వండి. మేం ప్రభుత్వం తరపున నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు వ్యవసాయ, అనుబంధ రంగాల యూనివర్సిటీల ఏర్పాటుకే ప్రభుత్వం నిర్ణయించుకుంద’ని సీఎం చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ మొదలు కాకముందే ప్రాంతీయ వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నెలలోపే ఇందుకు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని యూనివర్సిటీ వర్గాల సమాచారం.