పశు వైద్య కళాశాల మంజూరుపై హర్షం
Published Sun, Jul 24 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
మామునూరు : హన్మకొండ మండలం మామునూరులో పశు వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ చింతల యాదగిరి ఆధ్వర్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో పశు వైద్యకళాశాల ఏర్పాటుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బి.జయశంకర్, డానియల్, రమేష్, అనంత్, బాబు, శ్రీశైలం, కుమార్, హన్మన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement