- మామునూరులో ఏర్పాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- సాక్షి ఎఫెక్ట్
పశువైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
Published Sat, Jul 23 2016 8:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
సాక్షి, హన్మకొండ : వరంగల్‌లో పశువైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ మండలం మామూనూరు సమీపంలో వెటర్నరీ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. నిర్వాహణ కోసం 87 మంది టీచింగ్ స్టాఫ్, 205 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు రూ.208 కోట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది, నిధులకు సంబంధించి త్వరలో నిర్ణయం వెలువరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వరంగల్ నగరాన్నిSఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్ నగరంలో పశు వైద్య కళాశాలను నెలకొల్పుతామన్నారు. ఇచ్చిన హామీకి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మామునూరు సమీపంలో ఉన్న పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణంలో వెటర్నరీ కాలేజీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు.
Advertisement
Advertisement