Mamunuru
-
రన్‌వే చివరన ఉందని.. హైవే కోసం భారీ సొరంగం!
సాక్షి, హైదరాబాద్: పెద్ద ఎయిర్‌పోర్టు.. రన్‌వే చివరన ఓ రోడ్డు ఉంది.. విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ రోడ్డుపై వాహనాలకు తగులుతాయా అన్నంత కిందగా వస్తుంటాయి.. ఇది వినడానికి బాగానే ఉన్నా చాలా ప్రమాదకరమని, భద్రతా సమస్యలు వస్తాయని పౌర విమానయాన శాఖ అంటోంది. వరంగల్‌లో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు రన్‌వే చివరన హైవే ఉందని.. ఆ హైవేను అక్కడి నుంచి దూరంగా మళ్లించాలని, లేకుంటే ఆ రన్‌వే ప్రాంతం మొదలై, ముగిసే దాకా సొరంగం నిర్మించి వాహనాలను అందులోంచి పంపాలని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రన్‌వే చివరన.. వరంగల్ శివార్లలోని మామునూరులో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఆ విమానాశ్రయం రన్‌వే ముగిసి ప్రహరీ నిర్మించే చోటుకు కేవలం 500–700 మీటర్ల దూరంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి ఉంది. ఆ హైవేను మళ్లించాలంటే.. భారీగా భూసేకరణ చెయ్యాల్సి వస్తుంది, నిర్మాణ ఖర్చు భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో రన్‌వే చివరిలో కిలోమీటర్ పొడవున ప్రత్యేక సొరంగాన్ని నిర్మించి జాతీయ రహదారిని దాని గుండా మళ్లించాలని.. ఆ సొరంగం పైభాగాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని పౌర విమానయాన శాఖ ప్రతిపాదించింది. ఖర్చు వివరాలు చెప్పాల్సిందిగా లేఖ కొత్త విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ బాధ్యత యావత్తూ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమి, నిర్మాణ ఖర్చు వివరాలను పౌర విమానయాన శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. ఫేజ్–1 (డొమెస్టిక్) విమానాశ్రయానికి 724 ఎకరాల భూమి, రూ.248 కోట్లు.. ఫేజ్ –2 (అంతర్జాతీయ స్థాయి)కు 1,053 ఎకరాల భూమి, రూ.345 కోట్లు నిర్మాణ వ్యయం అవుతుందని టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ రిపోర్టులో వెల్లడించింది. తాజాగా కిలోమీటర్ పొడవున సొరంగమార్గం నిర్మించేందుకు అయ్యే ఖర్చు అదనం కానుంది. దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలపాలని రాష్ట్ర అధికారులు పౌరవిమానయాన శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతానికి ఖర్చు తగ్గించుకునేందుకు ఫేజ్–1 పద్ధతిలోనే విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. అవసరమైన భూమిని కూడా వంద ఎకరాల మేర తగ్గించేలా చూడాలని, సొరంగ మార్గం కూడా అర కిలోమీటరు పొడవుతో సరిపెట్టాలని కోరనున్నట్టు సమాచారం. కాగా.. త్వరలో నిర్వహించే సమావేశంలో రన్‌వే చివరన రోడ్డుకు ప్రత్యామ్నయ ఏర్పాట్లఫై చర్చించనున్నారు. పరిష్కారమేదీ లభించకపోతే సొరంగం నిర్మాణమే ఫైనల్ కానుంది. -
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఓ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ సృష్టించాడు. స్థానికుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ బార్ షాపులో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ చిత్తు మద్యం సేవించి దారిన పోయే మహిళలు, ప్రయాణికులను దుర్భాషలాడాడు. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని లెనిన్‌నగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వస్తున్న మరో ఇద్దరు మహిళలను ఆడ్డగించి దుర్భాషలాడమే కాకుండా వారిపై చేయి చేసుకున్నాడు. విషయం తెలియగానే మహిళల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని కానిస్టేబుల్‌ను నిలదీశారు. అంతుకాకుండా మామునూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించగించినట్లు తెలిసింది. అయితే, టీఎస్ఎస్పీ పోలీసు సంఘం నేతలు స్టేషన్‌కు చేరుకుని సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు కాకుండా యత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సై యుగేందర్‌ను వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాలేదని, బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి
మామునూరు: భర్త పట్టించుకోకపోవడం.. అత్త, ఆడబిడ్డ వేధింపులు, కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ వివాహిత ఇద్దరు కూతుళ్లతో పాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి, చిన్న కూతురు మృతిచెందారు. పెద్ద కూతురు గాయాలతో బయటపడింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన భవానీ (25), భూమ శివశంకర్ (27)లు దంపతులు. శివశంకర్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి అమృత వర్షిణి(3), మౌనిక వర్షిణి (18 నెలల) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నాళ్లుగా శివశంకర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు అత్త, అడబిడ్డ సూటిపోటిమాటలతో భవానీ తీవ్ర మనస్తాపా నికి గురైంది. దీంతో ఆదివారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు సహా తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. మృతురాలి పెదకుమార్తె అమృత వర్షిణి చిన్నపాటి కాలిన గాయాలతో బయటికిరాగా, తల్లి భవానీ, చిన్నకూతురు మౌనిక వర్షిణి(14 నెలలు) 80శాతం కాలిపోయారు. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆ తల్లి, బిడ్డలు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఇద్దరూ మృతిచెందారు. -
పశువైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
మామునూరులో ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ఎఫెక్ట్ సాక్షి, హన్మకొండ : వరంగల్‌లో పశువైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పీవీ నర్సింహరావు వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సూచించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ మండలం మామూనూరు సమీపంలో వెటర్నరీ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయనున్నారు. నిర్వాహణ కోసం 87 మంది టీచింగ్ స్టాఫ్, 205 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు రూ.208 కోట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సిబ్బంది, నిధులకు సంబంధించి త్వరలో నిర్ణయం వెలువరిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. వరంగల్ నగరాన్నిSఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా వరంగల్ నగరంలో పశు వైద్య కళాశాలను నెలకొల్పుతామన్నారు. ఇచ్చిన హామీకి తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మామునూరు సమీపంలో ఉన్న పశు పరిశోధన క్షేత్రం ప్రాంగణంలో వెటర్నరీ కాలేజీని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇక్కడ 128 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. -
కదలిక
మామునూరులో విమానాశ్రయం! ఐదున్నర దశాబ్దాల కల నెరవేరే వేళ తాజా పరిస్థితిపై నివేదిక కోరిన కేంద్రం 1,200 ఎకరాల భూమి అవసరం.. నిధులిస్తే మిగతా భూసేకరణకు ఏర్పాట్లు గాలిమోటార్పై జిల్లావాసుల్లో ఆశలు హన్మకొండ అర్బన్ :జిల్లాలో విమానాశ్రయంపై తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. గాలిమోటార్లో తిరిగే అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మామునూరులో ఏరుుర్పోర్టు ఏర్పాటైతే ప్రయోజనకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం జిల్లా యంత్రాంగం, నాయకులు తమవంతు ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం.. గతంలో రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనలపై తాజాగా నివేదిక కోరడంతో మామునూరు విమానాశ్రయం విషయంలో కదలికవచ్చింది. తొలి ప్రధాని వచ్చినప్పటి కల.. జిల్లాలోని మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని డిమాండ్ ఇప్పటిది కాదు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారిగా వాయుదూత్ విమానంలో మామునూరులో దిగారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం భవిష్యత్ అవసరాల దృష్ట్యా మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతూనే ఉంది. అప్పటి నుంచి మొదలైన భూసేకరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇంతకాలం ఆశించిన స్థాయిలో మామునూరువిమానాశ్రయంలో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. 1960కి ముందే భూసేకరణ మామునూరులో విమానాశ్రయం ఏర్పాటునకు 1960 కన్నా ముందే భూసేకరణ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నారుు. ఆ సమయంలో ఏనుమాముల గ్రామం పరిధిలో 320 ఎకరాలు, నక్కలపల్లి గ్రామం పరిధిలో 96 ఎకరాలు, తిమ్మాపురం పరిధిలో 290 ఎకరాలు మొత్తం 706 ఎకరాలు సేకరించారు. విమానాశ్రయానికి రన్‌వే, టర్మినల్, ఇతర అవసరాల కోసం కనీసం 1,200 ఎకరాలకు తగ్గకుం డా భూమి ఉండాలని చెప్పడంతో అదనంగా 450 ఎకరాలు సమీపంలో ఉన్న గ్రామాల రైతుల నుంచి భూసేకరణ చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో గాడిపల్లి పరిధిలో 243 ఎకరాలు, ఇతర సమీప గ్రామాల్లో మరో 184 ఎకరాలు మొత్తం 427 ఎకరాలు సేకరించేందుకు భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం భూసేకరణకు ప్రాథమిక అంచనాగా 2011 లెక్కల ప్రకారం రూ.28 కోట్లు అవసరమవుతాయని.. వాటి ని విడుదల చేస్తే రైతులకు 80 శాతం చెల్లింపులు చేసి భూమి స్వాధీనం చేసుకోవచ్చని అప్పట్లోనే అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపించారు. 2008లో కేంద్ర బృందం పరిశీలన 2008 సంవత్సరంలో ఒకసారి కేంద్రం నుంచి ఏయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాకు వచ్చింది. కలెక్టర్‌తో భేటీ తర్వాత మామునూరు విమానాశ్రయం ఏర్పాటు స్థలం పరి శీలించింది. అయితే అధికారులు చెప్పినట్లు అక్కడ 706 ఎకరాలు స్థలం లేదని అందులో సుమారు 11 ఎకరాల వరకు ఆక్రమణలకు గురయిందని గుర్తించింది. దీనిపై స్థలం కాపాడాలని కోరుతూ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఇందులోనే 142.11 ఎకరాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం పశు సంవర్ధక శాఖకు కేటాయించింది. రూ.కోటి కేటాయింపు జిల్లా యంత్రాంగం నుంచి 2012 ప్రారంభంలో భూ సేకరణ కోసం రూ.28 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతులు వెంటనే రాలేదు. దీంతో అధికారులు భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ప్రకటన జారీ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత పనుల్లో పురోగతి లేదు. అయితే 2012లో భూసేకరణ చట్టంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేయడం వల్ల అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు రాలేదని అధికారులు ముందుకు కదల్లేదు. ప్రాంతీయ విమానాశ్రయం? కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు విషయం తెరపైకి తేవడంతో మా మునూరు విషయం మరోసారి ముందుకు వచ్చిం ది. అయితే మిగతా జిల్లాలతో పోల్చి చూస్తే భూసేకరణ, ఇతర అంశాల విషయంలో మామునూరుకు అన్నీ అనుకూల అంశాలు ఉండటంతో స్వరాష్టలో అయినా విమానాశ్రయం చూడాలన్న జిల్లావాసుల కలనెవేరుంతుందనే ఆశలు చిగురిస్తున్నాయి.