వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఓ టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించాడు.
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఓ టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించాడు. స్థానికుల కథనం ప్రకారం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ బార్ షాపులో టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్ చిత్తు మద్యం సేవించి దారిన పోయే మహిళలు, ప్రయాణికులను దుర్భాషలాడాడు. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని లెనిన్‌నగర్ కాలనీలోని బంధువుల ఇంటికి వస్తున్న మరో ఇద్దరు మహిళలను ఆడ్డగించి దుర్భాషలాడమే కాకుండా వారిపై చేయి చేసుకున్నాడు.
విషయం తెలియగానే మహిళల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని కానిస్టేబుల్‌ను నిలదీశారు. అంతుకాకుండా మామునూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించగించినట్లు తెలిసింది. అయితే, టీఎస్‌ఎస్పీ పోలీసు సంఘం నేతలు స్టేషన్‌కు చేరుకుని సదరు కానిస్టేబుల్‌పై కేసు నమోదు కాకుండా యత్నాలు ఆరంభించినట్లు సమాచారం. ఈ విషయమై ఎస్సై యుగేందర్‌ను వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాలేదని, బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.