కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి | Two died in family calamities at Mamunuru | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి

Published Tue, Jun 6 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి

కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి

మామునూరు: భర్త పట్టించుకోకపోవడం.. అత్త, ఆడబిడ్డ వేధింపులు, కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ వివాహిత ఇద్దరు కూతుళ్లతో పాటు తనపై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి, చిన్న కూతురు మృతిచెందారు. పెద్ద కూతురు  గాయాలతో బయటపడింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆదివారం రాత్రి  ఈ సంఘటన జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన  భవానీ (25), భూమ శివశంకర్‌ (27)లు దంపతులు. శివశంకర్‌ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి అమృత వర్షిణి(3), మౌనిక వర్షిణి (18 నెలల) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నాళ్లుగా శివశంకర్‌ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు.

 మరోవైపు అత్త, అడబిడ్డ సూటిపోటిమాటలతో  భవానీ తీవ్ర మనస్తాపా నికి గురైంది. దీంతో ఆదివారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు సహా తనపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకొంది. మృతురాలి పెదకుమార్తె అమృత వర్షిణి చిన్నపాటి కాలిన గాయాలతో బయటికిరాగా, తల్లి భవానీ, చిన్నకూతురు మౌనిక వర్షిణి(14 నెలలు) 80శాతం కాలిపోయారు. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆ తల్లి, బిడ్డలు  చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఇద్దరూ మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement