పందిరి స్వాతి, జశ్విత(ఫైల్)
మందస: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన దుమ్మువాళ్లూరు గ్రామానికి చెందిన పందిరి స్వాతి, ఆమె నాలుగు నెలల కుమార్తె అనుమా నాస్పదంగా మృతి చెందారు. స్వాతికి సోంపేట మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల మనోజ్‌కు ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసిన పందిరి స్వాతిని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గేదెల మనోజ్‌తో 2017వ సంవత్సరంలో వివాహం చేశారు. వృత్తిరీత్యా బెంగళూరులో మనోజ్ ఉండడంతో స్వాతి కూడా బెంగళూరు వెళ్లింది. వీరిద్దరికి నాలుగు నెలల చిన్నారి జశ్విత ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం రాత్రి స్వాతి తన కుమార్తెను గొంతు నులిమి చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.
ముందుగా చిన్నారి మరణించిందని సమాచారం రావడంతో స్వాతి కుటుం బ సభ్యులు హుటాహుటీన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వారికి స్వాతి కూడా మరణించిందని తెలియడంతో వారంతా ఈ సమాచారాన్ని గ్రామంలోని బంధువులకు తెలియజేశారు. స్వాతి అనా రోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతర ఏమైనా కారణా లున్నాయా.. తెలియరావడంలేదు. కా గా, స్వాతి ప్రసవం సమయంలో అనా రోగ్యం వెంటాడడంతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అదే జరిగితే చిన్నారిని ఆమె హత్య చేసిందా.. లేక ఏం జరిగిందన్న విషయాలు పూర్తిస్థాయిలో తెలియడంలేదు. బెంగళూరులోనే మృతదేహాల కు పోస్టుమార్టం జరిగిందని అక్కడకు వెళ్లిన వారు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ సం ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment