దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఈ నెల 5న జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఉంటుంది. ఎవరికి ఎక్కడెక్కడ పరీక్ష కేంద్రం కేటాయించిందీ సంబంధిత విద్యార్థికి అందజేసిన అడ్మిట్ కార్డులో పొందుపరిచారు.