తమిళసినిమా: నీట్ పరీక్షలతో తమ గ్రామ విద్యార్థులను ఒక్కొక్కరిని కోల్పోతున్నామని నటుడు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇంతకు ముందు నీట్ పరీక్షను రాయడానికి పోరాడి వైద్య విద్యార్థిని అనిత ప్రాణాలను కోల్పోయిందన్నారు.
ఇప్పుడు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడంతో ప్రతిభ ప్రాణాలను తీసుకుందన్నారు. ఈ వార్త వినడానికే వేదనగా ఉందన్నారు. నీట్ పరిక్షలు రాసే విద్యార్థులకు తన సాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. అదే విధంగా నీట్ పరీక్షలు తప్పనిసరి అని భావిస్తే విద్యార్థులకు తగిన వసతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. లేకంటే తమిళనాడులో ఒక్క పేద విద్యార్ధి డాక్టరు కావడం సాధ్యం కాదని విశాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment