సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తెలంగాణ ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించింది. తెలంగాణలోని విద్యార్థుల నీట్ ర్యాంకుల ఆధారం గా ప్రోవిజనల్ మెరిట్ లిస్టును వైస్‌చాన్స్‌లర్ బి.కరుణాకర్ వెల్లడించారు. తాజా వివరాలు ప్రొవిజనల్ మెరిట్ జాబితా మాత్రమేనని, దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా సీట్ల భర్తీకి ముందు తుది ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకారం రోహన్‌పురోహిత్, వరుణముప్పిడి, సిద్దార్థ్ రవి, టి.మహేశ్, జి.శ్రీ వత్సవ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. 3,235 మంది వివరాలతో ప్రొవిజనల్ జాబితా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment