meritlist
-
నీట్ ప్రొవిజనల్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్ : వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తెలంగాణ ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటించింది. తెలంగాణలోని విద్యార్థుల నీట్ ర్యాంకుల ఆధారం గా ప్రోవిజనల్ మెరిట్ లిస్టును వైస్‌చాన్స్‌లర్ బి.కరుణాకర్ వెల్లడించారు. తాజా వివరాలు ప్రొవిజనల్ మెరిట్ జాబితా మాత్రమేనని, దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా సీట్ల భర్తీకి ముందు తుది ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రొవిజనల్ మెరిట్ జాబితా ప్రకారం రోహన్పురోహిత్, వరుణముప్పిడి, సిద్దార్థ్ రవి, టి.మహేశ్, జి.శ్రీ వత్సవ్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. 3,235 మంది వివరాలతో ప్రొవిజనల్ జాబితా రూపొందించారు. -
వెబ్సైట్లో వైద్య సిబ్బంది మెరిట్ జాబితా
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో రాష్ట్రీయ బాల స్వస్తయ కార్యక్రమంలో సంచార ఆరోగ్య బృందాలలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేసేందుకు మెడికల్ ఆఫీసర్స్ (స్త్రీ, పు), మెడికల్ ఆఫీసర్స్ ఆయుష్ (స్త్రీ, పు), ఫార్మసిస్టులు, ఏఎన్ఎం పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన మెరిట్ జాబితా www.kadapa.nic.in అనే వెబ్సైట్లో పొందుపరిచామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సత్యనారాయణరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెరిట్ జాబితా అభ్యర్థుల సౌలభ్యం కోసం కడప నూతన కలెక్టరేట్, డీఎంహెచ్ఓ కార్యాలయాలతోపాటు జిల్లాలోని కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 28వ తేది సాయంత్రం 5 గంటల్లోగా రాత పూర్వకంగా డీఎంహెచ్ఓ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు. -
వైద్య కోర్సుల్లో జాట్లకు రిజర్వేషన్‌పై డీయూకు నోటీస్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల్లో జాట్ కేటగిరికి రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి, ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)కి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. వర్సిటీలో ఇప్పటికే సీట్లు పొందిన నలుగురు ఓబీసీ విద్యార్థులు వేసిన వ్యాజ్యం మంగళవారం విచారణ కు వచ్చింది. 2014 విద్యా సంవత్సరానికిగాను డీయూలో వివిధ వైద్య కోర్సులకు సంబంధించి 229 డిగ్రీ, 29 డిప్లొమా సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో రిజ ర్వేషన్ ప్రకారం డిగ్రీలో 62, డిప్లొమాలో 8 సీట్లు ఓబీసీకి కేటాయించింది. కాగా, గత ఫిబ్రవరి 25వ తేదీన డీయూ మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాట్లను ఓబీసీలో చేరుస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం డీయూ జాట్ కేటగిరిని ఓబీసీలో చేర్చి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను సవరించింది. దాంతో మొదట ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌లో సీట్లు వచ్చిన నలుగురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మొదటిసారి ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌ను పక్కన బెట్టి జాట్లతో కలిపి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించడం అన్యాయమని వారు వాదించారు. కాగా, దీనిపై తమ సమాధానాన్ని ఫైల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, డీయూకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీచేసింది.