ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి వైఖరి వల్లే రెండేళ్లుగా ప్రత్యేక హోదా దూరమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి వైఖరి వల్లే రెండేళ్లుగా ప్రత్యేక హోదా దూరమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతోన్న బంద్‌లో టీడీపీ కూడా పాల్గొనాలని డిమాండ్‌చేశారు. ఎన్నికలలో మోదీకి అనుకూలంగా ప్రచారం చేసిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రత్యేక హోదా అంశానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పదవి కోసం వెంకయ్యనాయుడు ప్రాకులాడుతున్నారని విమర్శించారు. మోదీ జపం చేసిన పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నోరు తెరవాలని, లేనిపక్షంలో ప్రజాద్రోహిగా మిగిలిపోతారని అన్నారు.