ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎందుకు ప్రకటించారని , ఆ ప్రకటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎందుకు ప్రకటించారని , ఆ ప్రకటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏం ఇస్తారనే విషయాన్ని చెప్పకుండానే రాజధాని గురించి ప్రకటన చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.
రుణమాఫీపై చంద్రబాబు ఎందుకు జారుకుంటున్నారని మధు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రుణమాఫీ చేయలేని ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ రైతులను మోసం చేస్తోందని మధు అన్నారు.