
'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు'
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో ఏమీ లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీతో ఏం మాట్లాడారో చెప్పాలని మధు అడిగారు.