బాబు ఇప్పటికైనా పోరుకు కదలాలి: మధు
సాక్షి,హైదరాబాద్: కేంద్రంపై ఆందోళనకు నిరంతర ఒత్తిడికి చంద్రబాబు సన్నద్ధం కావాలనీ, కేంద్రం ప్రత్యేక హోదా పేరిట దారుణంగా మోసం చేసిందనీ సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు బుధవారం రాత్రి అన్నారు.ఎలాంటి అదనపు కేటాయింపులు లేకుండానే ఉన్న వాటికి సర్దుబాటు చేసేలా ప్యాకేజీ ప్రకటించి చేతులు దులిపేసుకుందన్నారు. ప్రత్యేక హోదా తిరస్కరించడానికి రాజ్యాంగ కారణాలు ఏమిలేవన్నారు. 14వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌లు కూడా కారణం కాదనీ ఇది కేవలం బీజేపీ ఏకపక్ష తిరస్కరణ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామనీ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని వెల్లడించారు.