తుందుర్రులో పర్యటించిన అఖిలపక్షం
Published Tue, Mar 14 2017 1:51 PM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM
ఏలూరు: తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తుందుర్రులో ఆక్వా పార్కు నిర్మాణాన్ని చేపట్టనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో సోమవారం అఖిలపక్షం పర్యటించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్దితుల్లోనూ కొనసాగనీయమని.. ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల కోసం తాము జైలుకైనా వెళ్తామన్నారు. టీడీపీ, బీజేపీలు బుడబుక్కల పార్టీలని, రెండేళ్లలో చంద్రబాబు దుకాణం మూసుకోవడం ఖాయమన వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement