Aqua Food Factory
-
తుందుర్రులో పర్యటించిన అఖిలపక్షం
ఏలూరు: తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తుందుర్రులో ఆక్వా పార్కు నిర్మాణాన్ని చేపట్టనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో సోమవారం అఖిలపక్షం పర్యటించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్దితుల్లోనూ కొనసాగనీయమని.. ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల కోసం తాము జైలుకైనా వెళ్తామన్నారు. టీడీపీ, బీజేపీలు బుడబుక్కల పార్టీలని, రెండేళ్లలో చంద్రబాబు దుకాణం మూసుకోవడం ఖాయమన వ్యాఖ్యానించారు. -
'ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే సహించేది లేదు'
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే సహించేది లేదని వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. శనివారం పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వాఫుడ్ బాధిత గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆక్వాఫుడ్ బాధిత గ్రామ ప్రజలకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ భరోసా ఇచ్చింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాన్ని సముద్రంలో కలిపేందుకు ఏపీ ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసిందంటున్నారు. అయితే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రజాధనం ఏ విధంగా వెచ్చిస్తారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆళ్ల నాని డిమాండ్ చేశారు.