ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దౌర్జన్యంగా ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే సహించేది లేదని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. శనివారం పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వాఫుడ్ బాధిత గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పర్యటించారు.
ఈ సందర్భంగా ఆక్వాఫుడ్ బాధిత గ్రామ ప్రజలకు అండగా ఉంటామని వైఎస్‌ఆర్‌సీపీ భరోసా ఇచ్చింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాన్ని సముద్రంలో కలిపేందుకు ఏపీ ప్రభుత్వం రూ. 20 కోట్లు విడుదల చేసిందంటున్నారు. అయితే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రజాధనం ఏ విధంగా వెచ్చిస్తారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆళ్ల నాని డిమాండ్ చేశారు.
'ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే సహించేది లేదు'
Published Sat, Oct 15 2016 7:04 PM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement