ప్రజా గ్రహం నుంచి తప్పించుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
సాక్షి, విజయవాడ: ప్రజా గ్రహం నుంచి తప్పించుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రం అధోగతిపాలు కావడానికి చంద్రబాబే కారణమని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలను సీఎం ఏనాడు పట్టించుకోలేదన్నారు. బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు తరహాలో ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.