సాక్షి, ఒంగోలు: భారతీయ జనతా పార్టీకి వస్తోన్న ప్రజాధరణ చూసి పార్టీలు భయపడుతున్నాయిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే టీడీపీ అడ్రస్ ఉండేదే కాదన్నారు.
ఏపీ అభివృద్దికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజకీయ ఉపన్యాసం చేశారని, కేంద్రం కేటాయించిన నిధుల గురించి చంద్రబాబు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment