gvl narasimha rao
-
15 వేల కోట్లు అప్పే.. కుండబద్దలుగొట్టిన జీవీఎల్
-
వైజాగ్‌లో పురందేశ్వరికి బిగ్ షాక్..!
-
ఏపీ: ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం!
సాక్షి, అమరావతి : ఏపీలో రూ. 53వేల కోట్లు దారిమళ్లాయని, టీడీపీ ప్రభుత్వం ఈ సొమ్మును 58 వేల పీడీ అకౌంట్లలో వేసిందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. జీవీఎల్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాగ్ నివేదికతో ఈ కుంభకోణం బహిర్గతం అవుతుందని, కాగ్‌కు టీడీపీ నేతలు ఈ విషయాలు తెలియజేయకున్నా.. కాగ్ దృష్టి నుంచి ఈ విషయాన్ని తప్పించలేరని అన్నారు. టీడీపీ నాయకులు అవినీతి దొంగల్లా మట్లాడుతున్నారని, తాను అడిగిన ప్రశ్నలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమల్ని క్షమించరని వ్యాఖ్యానించారు. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌కి పట్టిన గతే మీకు పడుతుందని టీడీపీ నేతలను హెచ్చరించారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షేర్ మార్కెట్ బ్రోకర్‌తో సమాధానం చెప్పిస్తున్నారని విమర్శించారు. 53 వేల కోట్ల అవినీతిపై శ్వేత పత్రం విడుదల చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలకు ఆయన ఏడు ప్రశ్నలు సంధించారు. పీడీ అకౌంట్స్‌లో డబ్బులు ఉండగా ఎందుకు అప్పులు తెస్తున్నారని ప్రశ్నించారు. -
‘బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోంది’
సాక్షి, ఒంగోలు: భారతీయ జనతా పార్టీకి వస్తోన్న ప్రజాధరణ చూసి పార్టీలు భయపడుతున్నాయిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకుంటే టీడీపీ అడ్రస్ ఉండేదే కాదన్నారు. ఏపీ అభివృద్దికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు రాజకీయ ఉపన్యాసం చేశారని, కేంద్రం కేటాయించిన నిధుల గురించి చంద్రబాబు ఎందుకు లెక్కలు చెప్పడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
జవాబు చెప్పలేక పారిపోతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం చంద్రబాబు పారిపోతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ఎలాంటి అవగాహన లేకుండా చంద్రబాబుకు అమిత్ షా లేఖ రాశారంటూ టీడీపీ చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయట్లేదు కాబట్టి ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని టీడీపీ చెప్పడం పూర్తిగా రాజకీయ లబ్ధికోసమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల కాలపరిమితిలో గత యూపీఏ హయాంతో పోలిస్తే 107 శాతం అధిక నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీంతోపాటు అదనంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పారు. అప్పుడు దాన్ని స్వాగతించడమేగాక.. ఇదంతా తమ కృషి ఫలితమేనని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడానికి రాజకీయకారణాలే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధితో కాదని మండిపడ్డారు. గత నాలుగేళ్లకాలంలో కేంద్రం నుంచి ఎంతో సాధించామని గొప్పలు చెప్పుకొని ఇప్పుడు ఏపీపై కేంద్రం వివక్ష చూపుతోందని 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు చెప్పడం దేనికి నిదర్శనమని నిలదీశారు. రాజధానికిచ్చిన రూ.1,000 కోట్ల నిధుల్లో 8 శాతం కూడా ఖర్చు చేయలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.1,050 కోట్లలో 88 శాతం నిధులు ఖర్చు చేయలేదన్నారు. మళ్లీ గెలవలేమని తెలిసే..: వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలవలేమని తెలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని జీవీఎల్ విమర్శించారు. కేంద్రం లెక్కలతోసహా చెబుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అవలంబిస్తోందన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానిని కలవడంపై చంద్రబాబు చేసిన తీవ్ర వ్యాఖ్యలమీద జీవీఎల్ స్పందిస్తూ.. సీఎం స్థాయి వ్యక్తి బాధ్యత మరిచి సినిమా డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు. -
రాజయ్య కోడలికి మీరేం న్యాయం చేశారు?
న్యూఢిల్లీ: దళితులపై హింసను అడ్డుకునే పేరుతో కాంగ్రెస్ రాజకీయాలకు పాల్పడుతోందని బీజీపీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ముగ్గురు పిల్లలు సహా సారిక ఆత్మహత్యకు పాల్పడితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏ న్యాయం చేసిందని విరుచుకుపడ్డారు. దళితులపై కపట ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్, ఆ పార్టీ ఎంపీ ఇంట్లో జరిగిన ఘోరంపై ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లల సజీవ దహన ఘటనపై .. దళితులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని సోనియాని ఈ సందర్భంగా నరసింహారావు ప్రశ్నించారు. గత నవంబర్ 4న జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో సహా ముగ్గురు పిల్లలు అభినవ్, అయోన్, శ్రీయోన్‌లు సజీవ దహనమయ్యారు. కొద్దిరోజులుగా రాజయ్యకు ఆయన కోడలు సారికకు మధ్య విభేదాల నేపథ్యంలో కోడలు సారిక పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే.