ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దేశ రాజధానిలో జరుగుతున్న వైఎస్‌ఆర్ సీపీ మహాధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ...‘బీజేపీకి పోయేకాలం వచ్చింది. అందుకే విజభన హామీలు అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీనే మంచిదంటూ కేంద్రం అడుగులకు చంద్రబాబు నాయుడు మడుగులొత్తుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలా పోరాడామో, హోదా సాధన కోసం అలాగే పోరాడదాం.’ అని పిలుపునిచ్చారు.