♦ ఇళ్లపై నుంచి తీసిన తీగలు తెగిపడి ఇద్దరి మృత్యువాత
♦ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఘటన
♦ బోరున విలపించిన కుటుంబ సభ్యులు, బంధువులు
♦ కేసు నమోదు చేసిన పోలీసులు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం దంపతులను బలిగొంది. ఇళ్ల మీది నుంచి వెళ్లిన 11కేవీ తీగలు వేలాడుతున్నాయని, వాటిని తీసేయమని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం గాలి దుమారానికి అవి తెగిపడడంతో దంపతులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే తనువు చాలించారు.
కరీమాబాద్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు దంపతులను బలిగొంది. ఇళ్ల మీది నుంచి వెళ్లిన 11కేవీ తీగలు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడిన సంఘటన నగరంలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అంకతి రమేష్(50), రాజమణి(45) దంపతులు కొన్నేళ్లుగా ఎస్‌ఆర్‌ఆర్ తోటలో నివాసముంటున్నారు. ఇదే కాలనీలో కరెంట్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఇళ్ల మీదుగానే వెళుతున్నారుు. అక్కడక్కడ ఆ తీగలు కిందికి వేలాడినట్లు ఉండడంతో కర్రల సాయంతో వాటిని పైకి లే పారు. అరుుతే ఆదివారం కురిసిన వర్షం, గాలి దుమారానికి రమేష్ ఇంటి మీద నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు తెగి దుస్తులు ఆరేసే తీగకు ఆనుకున్నాయి.
ఈ క్రమంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన రాజమణి దుస్తులు పిండి వాటిని తీగపై ఆరేస్తుండగా షాక్‌తగిలి విల విలలాడసాగింది. ఇది గమనించిన రమేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతడికి కూడా షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే విద్యుత్ సిబ్బంది సమాచారమివ్వగా వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మిల్స్‌కాలనీ పోలీ సులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా రమేష్, రాజమణి దంపతులకు పిల్లలు లేరని స్థానికులు చెప్పారు.
ఒంటరిగా మిగిలిన మృతుడి తల్లి
రమేష్ మృతితో అతడి తల్లి ఒంటరిగా మారింది. తనకు దిక్కెవరని బోరున విలపించింది. మృతుల దగ్గరి బంధువులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు.
తీగలు తొలగించాలని చెప్పాం : సజన్‌లాల్, స్థానికుడు
ఇళ్ల మీద నుంచి వె ళుతూ ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు తొలగించాలని ఎన్నో ఏళ్లుగా సంబంధిత విద్యుత్ అధికారులకు చెప్పుకొస్తున్నాం. అరుు నా వారు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రెండు ప్రాణాలు పోయాయి. దీనికి విద్యుత్ అధికారులే బాధ్యులు.
ఇప్పటికైనా పట్టించుకోవాలి : సువర్ణ, స్థానికురాలు
మా కాలనీలో పది, పదిహేను ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు పోయాయి. మాకు ప్రాణసంకటంగా ఉందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా కర్రలు పాతి ఇంటికి వైర్లు తగలకుండా చేసిన ఇళ్లున్నాయి. వాటికి కూడా ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ఈ పాపం కరెంటోళ్లదే. ఇప్పటికైనా ఇళ్ల మీద ఉన్న తీగలు తీసేయాలి.
సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన
మృతుల కుటుంబానికి విద్యుత్ శాఖ నష్టపరిహారం చెల్లించాలని అండర్ రైల్వేగేటు సీపీఎం కార్యదర్శి మర్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఆర్‌తోట వాసులతో కలిసి కరీమాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పల్లం రవి, ఆడెపు బిక్షపతి, రామస్వామి, బత్తిని సతీష్, భాస్కర్, లక్ష్మన్, జానకి, వనజ, సరస్వతి పాల్గొన్నారు.
ఈ పాపం కరెంటోళ్లదే..
Published Mon, Apr 13 2015 2:14 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM
Advertisement
Advertisement