
పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి
విశాఖపట్నం : కమ్యూనిస్టుల బలోపేతానికి మరింత కృషి చేస్తానని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆదివారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్టీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఉంచి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అలాగే మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థవంతంగా ఎత్తిచూపుతామని సీతారాం ఏచూరి తెలిపారు.