
‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’
నెల్లూరు: రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అనైతిక చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రసారాల నిలిపివేతను అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించాలన్నారు.
‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని మధు డిమాండ్ చేశారు.