
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై మరో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో తమను నందకుమార్ మోసం చేసినట్లు ఆరోపిస్తూ మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నందకుమార్ వల్ల తాము రూ.2 కోట్లు నష్టపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు. మానిక్ చంద్ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment