Nandakumar
-
నందుకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలక నిందితుడు నందుకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చంచల్‌గూడ జైల్లో ప్రశ్నించనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశం ఉందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే ప్రధానాంశంగా నందుకుమార్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ నేతృత్వంలోని ఇద్దరు అధికారుల బృందం సన్నద్ధమైంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినట్టు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై ప్రధా నంగా ప్రశ్నించే అవకాశం ఉంది. నందుకుమార్ చెప్పే అంశాలే ఇప్పుడు ఈడీ అధికారుల దర్యా ప్తులో కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లతో సత్సంబంధాలు న్న వారు... ఈ డీల్ సందర్భంగా రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ ప్రస్తావించిన పేర్లు, ఆ సమయంలో వారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు.. ఎవరితో టచ్‌లో ఉన్నారు.. అన్న అంశాల ఆధారంగానే ‘సిట్’బృందం దర్యాప్తు చేసింది. సిట్ బృందాలు కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లోనూ కేవలం ఈ కేసుతో లింకులున్న వ్యక్తుల గురించి ఆరా తీయడంపైనే దృష్టి పెట్టింది. సిట్ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో నందుకుమార్ భార్యతోపాటు ఇద్దరు న్యాయవాదులను ప్రశ్నించింది. కానీ, ఎక్కడా డబ్బు ప్రస్తావన రాలేదు. నిందితుల అరెస్టు సమయంలో పెద్దమొ త్తంలో డబ్బులు ఇవ్వజూపారని మాత్రమే సైబరా బాద్ పోలీసులు వెల్లడించారు. కానీ, ఘటనా స్థలంలో మాత్రం నగదు పట్టుబడిన ఆధారాలు వెల్లడించలేదు. రూ. వందల కోట్లు ఆశజూపి బేరసారాలు జరిపినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణలో డబ్బు అంశంతో మరేమైన కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమ, మంగళవారాల్లో నందుకుమార్ ఇచ్చే వాంగ్మూలం కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోసారి పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేల ఎర కేసు ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నా రు. గత వారంలో రెండు రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఈనెల 27న మరోమారు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై మరో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో తమను నందకుమార్ మోసం చేసినట్లు ఆరోపిస్తూ మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నందకుమార్ వల్ల తాము రూ.2 కోట్లు నష్టపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు. మానిక్ చంద్ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! -
సొంతూరు.. పరిగి, ఎల్బీ నగర్, చైతన్యపురి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం. డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు. దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం. -
ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ప్రాపర్టీ కూల్చివేత
-
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ / బంజారాహిల్స్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌కు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌కు అనుబంధంగా ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం కూల్చేశారు. నందుకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై ఆధికారులు ఆరా తీశారు. దీంతో ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ సర్కిల్–18 పరిధి, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్ 2 (ఇంటి నంబర్ 8–2–293/82/ఎఫ్/2)లో సినీ నటుడు దగ్గుబాటి రానాకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని నందుకుమార్‌కు చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేష్‌కు చెందిన ప్లాట్ నంబర్ 3లోని వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందుకుమార్ లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. దగ్గుబాటి రానా ఫిర్యాదు తమ స్థలంలో, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రానా గతంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే అడ్డుకోవాలని రానా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నందకుమార్ నిర్మాణ పనులను కొనసాగిస్తుండటంతో ఆదివారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సుమారు 3 గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. నందకుమార్ భార్య సహా కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము చట్ట ప్రకారం లీజుకు తీసుకున్నామని, కోర్టు స్టే సైతం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (రాజకీయాలు చేయడానికి మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్) -
నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ (ఏ–1), నందకుమార్ (ఏ–2), సింహయాజీ స్వామి (ఏ–3)లను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వారు లొంగిపోని పక్షంలో పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలిపింది. ఈ నెల 27వ తేదీన ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ముగ్గుర్నీ అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. ఈనెల 26న రాత్రి మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే భౌతికంగా నగదు పట్టుబడకపోవటంతో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును జడ్జి తిరస్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఏసీబీ కోర్టు జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై జస్టిస్ సీహెచ్ సుమలత విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, నిందితుల తరఫున న్యాయమూర్తి ఇమ్మనేని రామారావు వాదనలు వినిపించారు. నిందితుల వెనుక పెద్దలెవరో నిగ్గు తేల్చాల్సి ఉంది: ఏజీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నిందితుల రిమాండ్ అవసరం. పోలీసులకు ముందుగా ఉన్న సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌లో సీసీ కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేశారు. నిందితులు వచ్చిన తర్వాత దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నిందితులు దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది. కిందికోర్టు రిమాండ్‌కు తరలింపునకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం చెల్లదు. నిందితులను రిమాండ్‌కు పంపేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలి. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డ్లిను నిందితులు ప్రలోభపెట్టారనేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయి. నిందితుల ముగ్గురి వెనుక ఉన్న కీలక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉంది. నిందితులను రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది..’ అని ఏజీ నివేదించారు. సివిల్ పోలీసులకు దర్యాప్తు అధికారం లేదు.. రామారావు వాదనలు వినిపిస్తూ.. ‘ఘటనా స్థలంలో నగదు ఏమీ లభ్యం కాకున్నా, కావాలని కేసులో ఇరికించారు. సీఆర్పీసీలోని 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా రిమాండ్‌కు పంపడం చట్ట వ్యతిరేకం. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పుల ప్రకారం 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిందే. అసలు అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఈ కేసు నమోదు, దర్యాప్తు చేసే అధికారం సివిల్ పోలీసులకు లేదు..’ అని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులను లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు లొంగిపోయినా, పోలీసులు అరెస్టు చేసినా జ్యుడీషియల్ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సీఆర్పీసీ సెక్షన్లు 50–ఏ, 51, 54,55, 56, 57లను పాటించాలని స్పష్టం చేశారు నందకుమార్ ఇంట్లో అరెస్టు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో షేక్‌పేటలోని ఆదిత్యా హిల్‌టాప్ అపార్ట్మెంట్లోని నందకుమార్ ఇంట్లో ముగ్గుర్నీ అరెస్టు చేసిన పోలీసులు.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. కాసేపటి తర్వాత మెయినాబాద్ ఠాణాకు తరలించి, మరోసారి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఇక్కడే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. నిందితులు ఇక్కడ ఉన్నంత వరకు పోలీసులు మీడియాతో పాటు ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టెస్టుల తర్వాత తిరిగి మెయినాబాద్ పీఎస్‌కు తీసుకొచ్చారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అయితే అప్పటికే కోర్టు సమయం ముగియడంతో సరూర్‌నగర్‌లోని జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. నిందితుల ఆరోగ్యం దృష్ట్యా రిమాండ్‌కు అనుమతించొద్దని వారి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి, జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యేందుకు వాహనం ఎక్కిన నిందితుల ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులకు సింహయాజి చెయ్యి ఊపుతూ టాటా చెప్పారు. మునుగోడు ఎన్నికల తర్వాతే కస్టడీ.. కేసు తదుపరి దర్యాప్తును మునుగోడు ఎన్నికల తర్వాతే చేయాలని హైకోర్టు ఆదేశించడంతో, నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని భావించిన సైబరాబాద్ పోలీసులకు బ్రేక్ పడినట్లయింది. నవంబర్ 4 తర్వాత కస్టడీ పిటిషన్‌ను సిద్ధం చేస్తామని, కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఫామ్‌హౌస్ సమావేశంపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించేందుకు నందకుమార్ ఏర్పాట్లు చేశారు. కానీ ఈలోగా హైకోర్టు అరెస్టు ఆదేశాలు ఇవ్వటంతో అది జరగలేదు. -
అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అధికారులను ఆదేశించారు. ఏదైనా ఘటన వెలుగుచూసిన వెంటనే బాధితులకు ఆర్థికసాయం అందించాలని, కేసు నమోదుతో పాటు చార్జిషీట్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారం, పరిహారం పంపిణీలో ఆలస్యమైతే బాధితులకు చట్టంపై విశ్వసనీయత తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా జాతీయ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ నందకుమార్ సాయి, సభ్యులు మాయా చింతం, హరిక్రిష్ణ దామొర్, హర్షబాయ్ చున్నిలాల్, సంయుక్త కార్యదర్శి ఎస్కే రాథో బృందం బుధవారం రాష్ట్రానికి చేరుకుంది. తొలిరోజు పర్యటనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కమిషన్ సభ్యు లు పర్యటించారు. గురువారం రాష్ట్ర ఉన్నతాధికారులతో కమిషన్ సమావేశం నిర్వహించింది. నందకుమార్ సాయి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ప్రభుత్వ విభాగాధిపతులు హాజరయ్యారు . గిరిజన సంక్షేమం, జనజాతి తెగల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గిరిజన యూనివర్సిటీ మాత్రమే జాప్యం రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని నందకుమార్ స్పష్టం చేశారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా నవీకరణ చేసి గిరిజనుల్లో రాజకీయ చైతన్యం పెంచడం శుభపరిణామమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనల్లో చెంచులు సాగుభూమి కావాలని కోరారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుందని కమిషన్ చైర్మన్ అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు కల్పించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఉన్నత విద్య కల్పనకు గురుకులాల ఏర్పాటు, ఆశ్రమ పాఠశాలల అప్‌గ్రెడేషన్ బాగుందని, గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సీఎస్ జోషి వివరించారు. ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను రెండు వందల రోజులకు పెంచాలని పలువురు గిరిజనులు తమను కోరినట్లు నందకుమార్ సాయి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ కార్యదర్శి సోమేశ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. -
నాల్గో పెళ్లి అడ్డుకున్నమూడో భార్య
చెన్నై: నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన భర్తను పోలీసులు పట్టించి పెళ్లిని అడ్డుకుంది అతని మూడో భార్య. ఈ ఘటన చెన్నైలో జరిగింది. వివరాలు.. మాధవరం తనికాచలం నగర్‌కు చెందిన నందకుమార్(34) కారు డ్రైవర్. ఇతనికి ఓట్టేసి కొసపేటకు చెందిన విజయలక్ష్మి(30)తో వివాహం నిశ్చయించారు. దీని ప్రకారం పెరంబూర్ సిరువళ్లూర్ రోడ్డు వద్ద ఉన్న పెళ్లి మండపంలో ఆదివారం పెళ్లి జరగాలి. అయితే కొళత్తూర్‌కు చెందిన ఉష(35) అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. నందకుమార్ తో తనకి వివాహం అయిందని, ఇప్పటికే మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం నాల్గో పెళ్లికి సిద్ధమయ్యాడని గొడవకు దిగింది. దీంతో సెబియం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అందులో నందకుమార్ తాను రైల్వే ఉద్యోగి అని నమ్మించి పలువురు యువతులను పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. నాల్గో భార్యగా విజయలక్ష్మిని చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పోలీసులు నందకుమార్‌ను అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి
కడప అగ్రికల్చర్ : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి మన్ననలు పొందాలని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (తిరుపతి) చీఫ్ ఇంజనీర్ నందకుమార్ కోరారు. ఇటీవల డిల్లీలో ప్రకటించిన ర్యాంకింగ్‌లో సేవలు అందించడంలో ఏపీఎస్పీడీసీఎల్కు 5వ స్థానం వచ్చిందని అన్నారు. ఈ ర్యాంకింగ్‌తో డిపార్టుమెంట్‌కు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని విద్యుత్ భవన్లో కడప నగరంలోని విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో విద్యుత్ అందించాలన్నారు. సబ్స్టేషన్లలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. ఒకరోజు పూర్తిగా 11కేవీ సబ్‌స్టేషన్‌లో ఉన్న సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరిస్తే మళ్లీ ఒక వారమో, ఒక నెల వరకు దాంతో పని ఉండదన్నారు. ఎక్కడెక్కడ లైన్‌లాస్ అవుతున్నదో గుర్తించి తీగలు లాగడం, కండెంసర్లు సరిచేయడం,చెట్ల కొమ్మలు తొలగించడం, లైన్లు బిగుతుగా ఉండేలా సరిచేయడం వంటి వాటి కి ప్రాధాన్యత ఇస్తే సరిపోతుందన్నారు. విద్యుత్ చౌర్యాన్ని పూర్తిగా అరికట్టేలా ఆయా చోరీదారులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయని, వాటిపై వారం వారం స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ఎస్ఈని ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్విఎస్ సుబ్బరాజు, జిల్లా విద్యుత్ రెవిన్యూ అధికారి సుబ్బారావు, విజిలెన్స్ సీఐ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి మృతిపై భిన్న కథనాలు...
మూర్ఛతో మృతి చెందాంటున్న పాఠశాల హెచ్ఎం స్నేహితుల దాడిలో చనిపోయాడంటున్న తోటి విద్యార్థులు పోలీసుల విచారణ గోల్కొండ: షేక్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నందకుమార్ అలియాస్ నందు అనే విద్యార్థి మృతి చర్చనీయాంశమైంది. అతడి మృతిపై పరస్పర విరుద్ధ కథనాలు వినిపిస్తున్నాయి. మూర్ఛ వచ్చి చనిపోయాడని పాఠశాల వారు, తోటి విద్యార్థులు కొట్టడంతో చనిపోయాడని కొందరు విద్యార్థులంటున్నారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడం కూడా అనుమానానికి దారి తీస్తోంది. గురువారం 3.30కి 10వ తరగతి విద్యార్థి నందు మూర్ఛ వచ్చి పడిపోయాడని పాఠశాల సిబ్బంది అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి తండ్రి కిషన్ కుప్పకూలి పడి ఉన్న తన కుమారుడిని ఆటోలో గచ్చిబౌలీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఐతే నందు అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. రాత్రి 11 గంటలకు మృతదేహాన్ని స్వగ్రామమైన నారాయణఖేడ్‌కు తరలిస్తుండగా కొందరు విద్యార్థులు వచ్చి కిషన్‌ను కలిశారు. పాఠశాలలో స్నేహితులు కొట్టడంతోనే నందు చనిపోయాడని చెప్పారు. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహినుద్దీన్, గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా.. నందకుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియాకు తరలించారు. పోలీసుల అదుపులో ఓ విద్యార్థి ? నందకుమార్ మృతిపై పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌తో పాటు ఇతర ఉపాధ్యాయలు, మృతుడి తల్లిదండ్రులను ప్రశ్నించారు. నందు అనారోగ్యంతో చనిపోయాడా? తోటి విద్యార్థులు కొట్టడం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు మాత్రం నందును స్నేహితులు కొడుతుండగా చూశామని పోలీసులకు తెలిపారు. మరోవైపు తన కొడుకుకు మోర్ఛ వ్యాధి లేదని మృతుడి తండ్రి కిషన్ పోలీసులకు తెలిపాడు. నందును విద్యార్థులు కొట్టిన విషయాన్ని, అతను స్పృహతప్పి పడిపోయిన విషయాన్ని ఘటన జరిగిన రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంతేకాకుండా తన ఫోన్‌ను కూడా ఆయన స్విచ్ఛాప్ చేసుకున్నాడు. నందుతో గొడవపడిన 15 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. నందకుమార్ మృతిపై స్థానికులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలువగా అతడు దురుసుగా మాట్లాడాడని, ‘ నందుకు టైం వచ్చింది.. చచ్చాడు.. చంపింది వీడే’ అని ఓ విద్యార్థిని చూపించాడని షేక్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ చెప్పారు. -
అశోక్‌బాబూ! తెలంగాణ గురించి తెలుసుకో.!
అనంతగిరి, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమం గురించి, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గురించి ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలుసుకొని మాట్లాడాలని, ఇందుకోసం ఆయన ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ నందకుమార్ ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న వికారాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ పునర్నిర్మాణం - మన కర్తవ్యం’ సదస్సు వాల్‌పోస్టర్లను స్థానిక అతిథిగృహంలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం నందకుమార్ మాట్లాడుతూ సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. సీమాంధ్రకు ఎలాంటి అన్యాయాలు జరిగాయి, ఏ విధంగా నష్టపోయిందీ వికారాబాద్ సదస్సుకు వచ్చి అశోక్‌బాబు వివరించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణాలర్పించారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రకటన వచ్చిందన్న సంగతిని విస్మరించరాదన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్, ముఖ్య సలహాదారు చిగుళ్లపల్లి రమేష్కుమార్లు మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు తెలంగాణవాదులను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు తమ జీతాలను త్యాగం చేసి పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. యువత, మేధావులు, తెలంగాణవాదులు అధిక సంఖ్యలో పాల్గొని 22నాటి సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్ పటేల్, డాక్టర్స్ జేఏసీ చైర్మన్ మెతుకు ఆనంద్, ఉద్యోగ జేఏసీ నాయకులు రవీందర్ రెడ్డి, అమర్‌శెట్టి, సుశీల్, అజయ్, ప్యాట మల్లేశం, వీరభద్రయ్య పాల్గొన్నారు.