నాల్గో పెళ్లి అడ్డుకున్నమూడో భార్య
నాల్గో పెళ్లి అడ్డుకున్నమూడో భార్య
Published Tue, Sep 12 2017 12:02 PM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
చెన్నై: నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన భర్తను పోలీసులు పట్టించి పెళ్లిని అడ్డుకుంది అతని మూడో భార్య. ఈ ఘటన చెన్నైలో జరిగింది. వివరాలు.. మాధవరం తనికాచలం నగర్‌కు చెందిన నందకుమార్(34) కారు డ్రైవర్. ఇతనికి ఓట్టేసి కొసపేటకు చెందిన విజయలక్ష్మి(30)తో వివాహం నిశ్చయించారు. దీని ప్రకారం పెరంబూర్ సిరువళ్లూర్ రోడ్డు వద్ద ఉన్న పెళ్లి మండపంలో ఆదివారం పెళ్లి జరగాలి. అయితే కొళత్తూర్‌కు చెందిన ఉష(35) అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది.
నందకుమార్ తో తనకి వివాహం అయిందని, ఇప్పటికే మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రస్తుతం నాల్గో పెళ్లికి సిద్ధమయ్యాడని గొడవకు దిగింది. దీంతో సెబియం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అందులో నందకుమార్ తాను రైల్వే ఉద్యోగి అని నమ్మించి పలువురు యువతులను పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. నాల్గో భార్యగా విజయలక్ష్మిని చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. పోలీసులు నందకుమార్‌ను అరెస్టు చేసి ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు.
Advertisement
Advertisement