ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్)ని పునరుద్ధరించింది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ గతేడాది నవంబర్‌లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జోవో ను రద్దు చేస్తూ.. సీబీఐ ప్రవేశానికి వీలుగా సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా జీవోతో రాష్ట్రలోని కేసుల విచారణకు సీబీఐకి మార్గం సులభం కానుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ఎప్పుడైనా దర్యాప్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.