
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలన్నాయంటూ నాగేశ్వరరావుపై పలు ఆరోపణలున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ ఆయన వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు.
(చదవండి : సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?)