CBI Additional Director
-
సీబీఐ అదనపు డైరెక్టర్ తొలగింపు..!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ పదవి నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలన్నాయంటూ నాగేశ్వరరావుపై పలు ఆరోపణలున్నాయి. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ ఆయన వైఖరిని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన అధికారులను బదిలీ చేశారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్‌కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రెండుసార్లు నియమితులయ్యారు. (చదవండి : సీబీఐ డైరెక్టర్‌గా తెలుగువాడెలా అయ్యారు?) -
సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
నాగేశ్వరరావుకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ప్రభుత్వ వసతి గృహాల్లో బాలికలపై లైంగిక దాడి ఘటనలపై విచారణ జరుపుతున్న అధికారిని బదిలీ చేయడం పట్ల అప్పటి సీబీఐ తాత్కాలిక చీఫ్ ఎం నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు చెప్పిన క్షమాపణలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేస్తూ ఆయనకు రూ లక్ష జరిమానా విధించింది. నాగేశ్వరరావుతో పాటు సీబీఐ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ బాసూరాం కూడా దోషేనని ఆయనకూ జరిమానా విధించింది. వీరు చేసినది పొరపాటు కాదని, ఉద్దేశపూర్వకమైన చర్యంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొన్నారు. కాగా, అంతకుముందు సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరావు సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను తాను కలలో కూడా ఉల్లంఘించనని పేర్కొన్నారు. ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేసే ముందు కోర్టు అనుమతి కోరకపోవడం తన తప్పిదమేనని సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్ నాగేశ్వరరావు అంగీకరించారు. తన పొరపాటును తాను పూర్తిగా తెలుసుకున్నానని, బేషరతుగా క్షమాపణ చెబుతున్నానంటూ తానెన్నడూ కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని నాగేశ్వరరావు సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు అనుమతిలేకుండా తాను షెల్టర్ హోం కేసును విచారిస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మను బదిలీ చేసి ఉండాల్సింది కాదని అఫిడవిట్లో ఆయన స్పష్టం చేశారు. కాగా షెల్టర్ హోం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడంపై నాగేశ్వరరావు తీరును గత వారం సుప్రీం కోర్టు ఆక్షేపించింది. న్యాయస్ధానం ఉత్తర్వులతో మీరు చెలగాటమాడారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నాగేశ్వరరావు తీరును తప్పుపట్టారు. -
సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అర్చనా రామసుందరం శుక్రవారం నియమితులయ్యారు. సీబీఐలో ఒక మహిళ ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. 1980 తమిళనాడు కేడర్‌కు చెందిన అర్చనకు సీబీఐ మాతృసంస్థ. ఆమె ఇందులో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా, జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఈ సంస్థలో తొలి మహిళా జాయింట్ డెరైక్టర్ కూడా ఆమే. 1996-2006 మధ్య ఆమె తెల్గీ స్టాంపుల కుంభకోణం వంటి పలు ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరిపారు. ఆమె గతంలో తమిళనాడు అదనపు డీజీపీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీస్ రిక్రూట్మెంట్ డెరైక్టర్ జనరల్‌గా ఉన్న అర్చనను సీబీఐ అదనపు డెరైక్టర్‌గా నియమించాలని సీబీఐ డెరైక్టర్ రంజింగ్ సిన్హా సిబ్బంది శాఖకు గట్టిగా సిఫార్సు చేశారు. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది.