ప్రశాంత్ భూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావుపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడాన్ని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. జాయింట్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేసినా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆయన్ని కాపాడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని తెలిపారు. ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం రాకేష్ అస్థానాపై 6 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాకేష్ అస్థానాను కాపాడేం దుకు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయినా ఆయన్నే తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన అలోక్ వర్మ.. ఆయన్ని సీబీఐ నుంచి తొలగించి ప్రాసిక్యూట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సిఫారసు చేశారు. కానీ నాగేశ్వరరావును సీవీసీ కాపాడారు’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment