prashanth bhushan
-
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు!
ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్‌లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. తమ మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గువాహటికి వెళుతుండగా వారిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ పోలీసులు, కేంద్ర బలగాలు వారికి రక్షణగా నిలిచాయి. ఏక్నాథ్ షిండేతో సహా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు విలేకరులు విఫలయత్నం చేశారు. మీడియాను తప్పించుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు పరుగందుకున్నారు. అయితే తమకు మెజారిటీ ఉందని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, శివసేన ఎమ్మెల్యేలను గొర్రెల మందను తరలించినట్టుగా సూరత్ విమానాశ్రయం నుంచి గుజరాత్ పోలీసులు తరలించారని ప్రముఖ న్యాయవాది, హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ ట్వీట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ ఈ కామెంట్ చేశారు. Gujarat Police herding the Maharashtra Shivsena MLAs like sheep at Surat airport! https://t.co/Kts1SbzoJL — Prashant Bhushan (@pbhushan1) June 22, 2022 మనసు మార్చుకున్న ఎమ్మెల్యేపై దాడి శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఒకరు మనసు మార్చుకుని సూరత్ హోటల్ నుండి బయలుదేరడానికి ప్రయత్నించాడని సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది ట్వీట్ చేశారు. అతడిని దాడి చేయాలని ఇతర ఎమ్మెల్యేలను ఏక్నాథ్ షిండే ఉసిగొల్పారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన గుజరాత్ పోలీసుల రక్షణలో ఆసుపత్రిలో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతి చతుర్వేది ట్వీట్‌పై ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ఎమ్మెల్యేలను సూరత్ హోటల్లో బంధించడం కిడ్నాప్ కంటే తక్కువేమీ కాదని వ్యాఖ్యానించారు. అధికార క్రీడలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోడమే కాదు.. అపహరణకూ గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (క్లిక్: ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వెనక బలమైన కారణాలు!) -
వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. ధీటైన రిప్లై.. షాకిచ్చిన ట్విటర్
వ్యాక్సిన్లను పరీక్షించకుండానే జనాలపై ప్రయోగిస్తున్నారని, యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందని, మరణాలు సంభవిస్తున్నాయని న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు తీవ్రదుమారాన్ని రేపాయి. అంతేకాదు వ్యాక్సిన్ పనితీరుపై తనకు అనుమానాలు ఉన్నాయని, పొరపాటున కూడా వ్యాక్సిన్ తీసుకోబోనని ఆయన కామెంట్లు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కేంద్రం, ట్విటర్ రెండూ.. ఆయనకు ధీటుగానే బదులిచ్చాయి. న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్లపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి. కరోనా వ్యాక్సిన్ల పనితీరును పరిశీలించకుండానే నేరుగా ప్రజలకు వేస్తున్నారని, దీనివల్ల యువత ప్రమాదం బారినపడుతోందని ఆయన కామెంట్లు చేశాడు. దీనిపై సెంటర్ కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తీవ్రంగా స్పందించాడు. కరోనా వ్యాక్సిన్ల భద్రతను, సమర్థతను తప్పుబట్టడం సరికాదని అరోరా వ్యాఖ్యానించాడు. ‘‘వ్యాక్సిన్ వికటించిన తొలి మరణం వివరాలను కూడా మేం ప్రజలకు అందుబాటులో ఉంచాం. అంతేకాదు డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్ వికటించిన ఘటనలపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నాం. ప్రజల్లో జ్వరాలు, నొప్పులు తప్పించి ప్రతికూల ప్రభావం చూపించిన కేసులు, సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఐసీయూలో, చావు అంచున ఉన్నవాళ్లపై కూడా వ్యాక్సిన్లు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి కదా. ఈ విషయాలేవీ ఆయనకు కనబడడం లేదా? ఎందుకు గుర్తించడం లేదు? అని అరోరా బదులిచ్చాడు. షాకిచ్చిన ట్విట్టర్ ఇక తప్పుడు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్.. ప్రశాంత్ భూషణ్ వ్యవహారంలో త్వరితగతిన స్పందించింది. ఆయన ట్వీట్లు తప్పుడు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు వ్యాక్సిన్ భద్రతపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నాయో చూడండని సూచించాయి. ఈ మేరకు త్వరలోనే ఆయన ట్వీట్లను ట్విటర్ తొలగించే ఆస్కారం కూడా లేకపోలేదు. పేపర్ కట్టింగ్‌తో మొదలు.. పదిరోజుల వ్యాక్సిన్ తీసుకున్న 45ఏళ్ల మహిళ మరణించడం.. ఆమె మృతికి వ్యాక్సిన్ కారణమని ఆమె భర్త ఆరోపించడం నేపథ్యంగా ఓ పేపర్లో కథనం పబ్లిష్ అయ్యింది. ఆ కట్టింగ్‌ను, వ్యాక్సిన్ పనితీరు వ్యర్థం అనే ఓ వెబ్ ఆర్టికల్‌ను తన ట్విటర్లో పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్.. యువత మీద, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మీద పరీక్షించకుండానే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగారు. కరోనాతో చనిపోయే అవకాశాలు మాత్రమే యువతకు ఉండేవని, కానీ, వ్యాక్సిన్‌తో ఆ అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని తీవ్ర కామెంట్లతో మరో ట్వీట్ చేశాడు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సహజంగా ఇమ్యూనిటీని సంపాదించుకుంటున్నారని, అలాంటి వాళ్ల ఇమ్యూనిటీని కూడా వ్యాక్సిన్ దెబ్బతీస్తోందని కామెంట్లు చేశాడు. A lot of people including friends & family have accused me of promoting Vaccine hesitancy, let me clarify my position. I am not anti Vaccine per se. But I believe it is irresponsible to promote universal vaccination of experimental&untested vaccines esp to young & Covid recovered https://t.co/SVHwgyZcvU — Prashant Bhushan (@pbhushan1) June 28, 2021 చదవండి: రూపాయి జరిమానా.. సరిపోతుందా? -
జరిమానా చెల్లించిన ప్రశాంత్ భూషణ్, కానీ...
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ఒక రూపాయి జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం రూపాయిని సుప్రీంకోర్టులో డిపాజిట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను ఈ రోజు సుప్రీంకోర్టుకు రూ.1 చెల్లించాను. అంతమాత్రానా నేను కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించినట్లు కాదు. నేను దీని మీద రివ్యూ పిటిషన్ వేస్తాను’ అని తెలిపారు. ఈసారి ఈ కేసుపై మరొక బెంచ్‌తో విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో ఆయనను దోషిగా తేల్చిన సుప్రీం కోర్టు ఆయనకు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. క్షమాపణ చెప్పాలని ధర్మాసనం ఆదేశించగా ఆయన నిరాకరించారు. దాంతో ఆయనకు సుప్రీం కోర్టు జరిమానా విధించింది. అది చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. దీంతో ఆయన ఈరోజు తనకు విధించిన జరిమానా రూ.1 ను డిపాజిట్ చేశారు. సెప్టెంబర్ 15 కల్లా జరిమానాను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే మూడు నెలలపాటు జైలుకు వెళ్లాల్సి వుంటుందని కూడా తెలిపింది. ఇక ప్రశాంత్ భూషణ్ 2009లో గతంలో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు అవినీతిపరులు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కోసం ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు ఉంది. చదవండి: జరిమానా కట్టేందుకు సిద్ధం : భూషన్ -
కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?
భారత సంవిధానం ఆర్టికల్ 19(1)(ఎ)లో పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నా కోర్టు ధిక్కారం చేస్తే శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందంటున్నది. న్యాయ స్థానాల తీర్పులను సమం జసంగా విమర్శించవచ్చునని, వారికి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించకుండా అభిప్రాయ వ్యక్తీ కరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరిం చింది. రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసును వేగంగా ముగించి బాధితురాలిని బయటకు గెంటి ప్రధాన న్యాయమూర్తిని నిర్దోషిగా ప్రకటించి నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో సహా చాలా మంది మౌనంగా ఉండడం కూడా భావవ్యక్తీకరణ హక్కు వినియోగమే. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదు. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరుమూసుకుని ఉండొచ్చు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సివిల్ పర మైన తప్పిదం. న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు చెప్పి నందుకు కోపించి, కోర్టులోనే చెప్పు విసరడం, తిట్టడం, అరవడం పైపైకి వెళ్లడం కోర్టు ధిక్కార నేరాలు. కోర్టుకిచ్చిన ప్రమాణ పత్రాలలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోయినా కోర్టు ధిక్కా రమే. వీటితో పాటు నిందాత్మక విమర్శలు అనే నేరం మరొకటి ఉంది. మామూలు కేసుల విచారణ నింపాదిగా దశాబ్దాల పాటు సా..ఆ..ఆ..గుతుంది. కానీ రాజ్యాంగ అధికారాలను వినియోగించి పెద్ద న్యాయస్థానాలు కోర్టు ధిక్కారం కేసులు స్వీకరిస్తే, శరవేగంగా జరుగుతాయి. దీన్ని సమ్మరీ హియ రింగ్ అంటారు. కోర్టు ధిక్కారం కేసులో పెద్దగా రుజువు చేయవలసిన అంశాలేమీ ఉండవు. నింది తుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రింట్లోనో, వీడియో లోనో, సోషల్ మీడియాలోనో భద్రంగా ఉంటాయి. అబద్ధాలు చెప్పి రేప్‌లు హత్యలు చేయలేదని చెప్పు కోవచ్చేమో కాని ‘కోర్టు ధిక్కారమా నాకు తెలి యదు, నేను చేయలేదు’ అని తప్పించుకోలేరు. ప్రశాంత్ భూషణ్‌తోపాటు కోర్టుధిక్కారం కేసులో ట్విట్టర్ కంపెనీవారు కూడా నిందితులు. క్షమాపణతో వారు బయటపడ్డారు. అయితే రెండు ట్వీట్లను వారు మళ్లీ ప్రచారంలో పెట్టకూడదు. ట్వీట్ కవులు, వాట్సాప్ విద్వాంసులకు ఇచ్చిన తీవ్ర మైన హెచ్చరిక సుప్రీంకోర్టు తాజా తీర్పు. సుప్ర సిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రెండు ట్వీట్లు ఆయనను దాదాపు జైలుకు పంపేవే. రూపాయి జరిమానాతో ఆయనకు జైలు తప్పిపోయింది. సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ నేరం చేశారని అందుకు ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నది. ఒకవేళ ఆ రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు సాధారణ జైలు జీవితం గడపాలని నిర్దేశించింది, బయటికి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయకూడదని నిషేధిం చింది. వీటికన్నా రూపాయి చెల్లించడం నయమని తెలిసి తమ ఉత్తర్వును వెంటనే పాటిస్తారని సుప్రీంకోర్టు చాలా కరెక్టుగా అంచనా వేసింది. కోర్టు ధిక్కారం చేసిన నేరగాళ్లందరినీ అంతే దయతో చూస్తుందని గ్యారంటీ లేదు. కొందరు ప్రముఖు లకు ఎక్కువ సమానత సమర్థనీయం అంటారు. ప్రశాంత్ భూషణ్ అన్నటువంటి మాటలే ఇదివరకు కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ మాట్లాడారు. సుప్రీంకోర్టు యాభైరూపాయల జరిమానాతో ముగించింది. మన తెలుగు నేత శివశంకర్ కేంద్రంలో న్యాయశాఖ మంత్రి ఓ అడుగు ముందుకు వేసి ‘‘ఫెరా ఉల్లంఘించే వారికి, వధువు లను తగలబెట్టేవారికి, జమీందార్లకి మన సుప్రీం కోర్టు స్వర్గం వంటిది’’ అన్నారు. కానీ అది ఒక అభిప్రాయం, విమర్శ అనీ, కోర్టు ధిక్కారం ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు వదిలేసింది. శివశంకర్ అన్నారుకదా అని మనమెందుకు రాయకూడదని ఫేస్బుక్, ట్విట్టర్లలో టకాటకా కామెంట్లు కొడితే చకచకా కటకటాలకు పోవలసి వస్తుంది. రాజ ద్రోహ, కోర్టు ధిక్కార నేరం వంటి ఈ భయానక శాసనాలు బ్రిటిష్ పాలకులకు అవసరమయ్యాయి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలు ఈ నేరాలను తీసేసి నాగరికు లయ్యారు. మనమే ఇంకా రాజభక్తితో ఈ నేరాలను బతికించి స్వేచ్ఛాజీవులుగా మరణిసు ్తన్నాం. పౌరసమాజం– ఈ అన్యాయ, బానిస, భయానక, అప్రజా స్వామిక నేర శాసనాలను సంవిధానపు పునాదుల నుంచి నిర్మూ లించేందుకు ఉద్యమాలు నిర్మించాల్సిందే. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రఫేల్‌పై వాడివేడీ వాదనలు.. తీర్పు రిజర్వు
సాక్షి: న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కోనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాడీవేడిగా జరిగింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరఫు అటర్నీ జనరల్ ధర్మసనానికి వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పిటిషనర్ల తరుఫున తొలుత వాదనలు వినిపించిన ప్రశాంత్ భూషణ్ కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒప్పందంలోని నిజనిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరఫున అటర్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి.. జెట్ల ధరలను బహిర్గతం చేయలేమని అన్నారు. పిటిషనర్లు ప్రతిసారి ధరల గురించి ప్రస్తావించడం సరైనది కాదని అసహనం వ్యక్తంచేశారు. ఇద్దరి వాదనలు విన్న ధర్మాసనం రెండు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలు తమకు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. కాగా రాఫెల్‌పై పిటిషన్ దాఖలు చేసిన మరో పిటిషనర్ అరుణ్ శౌరి న్యాయస్థానం ఎదుట తన వాదనల్ని విన్పించారు. పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్రం వాదన సరైంది కాదన్నారు. ఇప్పటికే కొన్ని పత్రాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే సుప్రీంకోర్టు గత తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
సుప్రీంకోర్టును మోసం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టును కేంద్రం మోసం చేసిందని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చేందుకు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందని పేర్కొన్నారు. రఫేల్ కేసులో డిసెంబర్ 14న వచ్చిన తీర్పును సమీక్షించాల్సిందిగా వారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రీజాయిండర్ అఫిడవిట్లో సుప్రీంకోర్టును కోరారు. తప్పుడు ఆధారాలు చూపి, సరైన పత్రాలను, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల ఆ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికి కూడా నిజమైన పత్రాలను కోర్టు ముందు ఉంచట్లేదని, అందుకే తాము నిజమైన పత్రాలను బహిర్గతపరచాలని డిమాండ్ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ‘సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేసిన వివరాలతో కేంద్రం తప్పుదోవపట్టించిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆధారాలను కేంద్రం తొక్కిపట్టి కోర్టు నుంచి తప్పుడు తీర్పు పొందింది’ అని ఆరోపించారు. రఫేల్ కేసు తీర్పుపై సమీక్ష జరపాలని పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు స్పందనగా ఆ ముగ్గురు రీజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, రఫేల్ తీర్పుపై సమీక్ష జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరుపుతామని సీజేఐ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. వారి ఆరోపణలు నిరాధారం.. రఫేల్ కొనుగోలు కేసులో పిటిషనర్ల ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రక్షణ శాఖ నుంచి లీక్ అయిన పత్రాల ఆధారంగా వచ్చిన వార్తాకథనాలపైనే వారు ఆధారపడ్డారని పేర్కొంది. ఇది కచ్చితంగా అధికారులు వారి విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమే అవుతుందని వెల్లడించింది. -
ఎలక్టోరల్ బాండ్లపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
రఫేల్‌పై తీర్పును పునఃసమీక్షించండి
న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై వెలువరించిన సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టును కోరారు. 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 14న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి సంతకాలు లేకుండా ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌కవర్ నివేదికపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందని వారు కోర్టుకు విన్నవించారు. ‘కేవలం నమ్మశక్యంకాని ఆధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చిందని భావిస్తున్నాం. కనీసం సంతకాలు కూడా లేని సీల్డ్‌కవర్ నివేదికపై తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమ’ని యశ్వంత్‌సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత భూషణ్‌లు పిటిషన్లో వివరించారు. తీర్పును రిజర్వ్ చేసిన తరువాత అనేక కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, వాటి మూలాల్లోకి వెళ్లి కోర్టు విచారించాలని, ఆ లోపు తీర్పును సమీక్షించాలని వారు కోర్టుకు విన్నవించారు. -
నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులైన నాగేశ్వరరావుపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నా అవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించడాన్ని సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. జాయింట్ డైరెక్టర్‌గా నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సిఫార్సు చేసినా, కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆయన్ని కాపాడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలుచేస్తానని తెలిపారు. ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీంకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం రాకేష్ అస్థానాపై 6 కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. రాకేష్ అస్థానాను కాపాడేం దుకు, రఫేల్ ఒప్పందంపై దర్యాప్తు జరగకుండా ఉండేందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రభుత్వం రాత్రికి రాత్రే తొలగించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నాగేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. అయినా ఆయన్నే తాత్కాలిక డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన అలోక్ వర్మ.. ఆయన్ని సీబీఐ నుంచి తొలగించి ప్రాసిక్యూట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సిఫారసు చేశారు. కానీ నాగేశ్వరరావును సీవీసీ కాపాడారు’ అని ఆయన అన్నారు. -
'రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమం'
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమమని, దీనిపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానాపై స్టెర్లింగ్ బయోటెక్ డైరీలో పేరు ఉందని, సీబీఐయే రాకేశ్ పేరును ఎఫ్ఐఆర్లో పేర్కొందని చెప్పారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉన్న వ్యక్తిని సీబీఐకు స్పెషల్ డైరెక్టర్‌గా ఎలా చేస్తారని ప్రశ్నించారు. చూస్తుంటే దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ స్వతంత్రతను నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అనిపిస్తోందని అన్నారు. -
'అది లోక్‌పాల్ కాదు... జోక్పాల్'
ఢిల్లీ: కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్‌పాల్ బిల్లుపై స్వరాజ్ అభియాన్ నాయకులు ప్రశాంత్ భూషణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పెద్ద జోక్‌గా ఆయన అభివర్ణించారు. అవినీతికి వ్యతిరేకంగా బలమైన లోక్‌పాల్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అందులో విఫలమయ్యాడని దీనికి గాను ముఖ్యమంత్రి పదవి నుండి తక్షణమే వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో స్వతంత్ర్య విధానాలు గల సంస్థ ప్రస్తావన లేకపోవడాన్ని ప్రశాంత్ భూషణ్ తప్పు పట్టారు. గతంలో డిమాండ్ చేసిన జన్‌లోక్ పాల్ బిల్లుకు తూట్లు పొడిచి కొత్త బిల్లును ప్రవేశపెట్టారని, దీని వలన ప్రజలకు వచ్చే ప్రయోజనం లేదన్నారు. నిజాయితీతో కూడిన లోక్‌పాల్‌ను ప్రజలకు కేజ్రీవాల్ ఇవ్వలేకపోయాడని ఆరోపించిన ఆయన ఇదో పెద్ద జోక్పాల్ అని ఎద్దేవా చేశారు. -
ఆప్ నుంచి ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర ఔట్
న్యూఢిల్లీ: అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ సోమవారం రాత్రి వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. వీరితోపాటు అనంద్ కుమార్, అజిత్ ఝాలను కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. వీరికి జాతీయ క్రమశిక్షణ కమిటీ రెండ్రోజుల కిందటే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆప్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వారు సోమవారమే సమాధానమిచ్చారు. మార్చి 28న జరిగిన అక్రమ సమావేశం తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైందని.. దానికి తమ నుంచి సమాధానం కోరే అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ తొలి విడత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆ పదవికి రాజీనామా చేసే ముందు పార్టీ కార్యవర్గంలో ఎవరినీ సంప్రదించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. వీరి జవాబుతో కమిటీ సంతృప్తి చెందలేదని, అందుకే బహిష్కరణ వేటు వేసిందని పార్టీ ప్రతినిధి దీపక్ బాజ్‌పాయి తెలిపారు.