
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్ ఆస్థానా నియామకం అక్రమమని, దీనిపై తాను కోర్టులో పిటిషన్ వేస్తానని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. రాకేశ్ ఆస్థానాపై స్టెర్లింగ్ బయోటెక్ డైరీలో పేరు ఉందని, సీబీఐయే రాకేశ్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొందని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న వ్యక్తిని సీబీఐకు స్పెషల్ డైరెక్టర్‌గా ఎలా చేస్తారని ప్రశ్నించారు. చూస్తుంటే దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ స్వతంత్రతను నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని అనిపిస్తోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment