
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డీఎస్‌పీ దేవేందర్ కుమార్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమర్థించింది. రాకేష్ ఆస్థానా, దేవేందర్ కుమార్‌ల అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసులకు ఆధారాలు లేవంటూ కోర్టు తెలిపింది
మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మోయిన్ ఖురేషీ వ్యవహారంలో విచారణ సందర్భంగా.. కేసు నుంచి బయటపడేందుకు తాను రూ.2 కోట్ల లంచం పది నెలల్లో చెల్లించానని హైదరాబాద్ వ్యాపారి సతీష్ సానా ఫిర్యాదు మేరకు అక్టోబరు 15న ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment