06:30PM
►ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది.
►అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం
►ఏడు గంటలపాటు కవితను సీబీఐ విచారించింది.
► ఉదయం 11 గంటల నుంచి కవితను సీబీఐ ప్రశ్నించింది.
►సీఆర్‌పీసీ 161కింద కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది.
06:00PM
►లిక్కర్ స్కామ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సీబీఐ
►7 గంటలకు పైగా కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నిస్తున్న సీబీఐ
03:00PM
►ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది.
► రాఘవేంద్ర వత్స ఆధ్యర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కవితను ప్రశ్నిస్తోంది.
►కవిత నివాసంలో సీబీఐ విచారణ 4 గంటలుగాపైగా కొనసాగుతోంది.
►కవిత న్యాయవాది సమక్షంలోనే సీబీఐ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తోంది.
►సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది.
12:28AM
►కవిత నివాసంలో మూడు గంటలకు కొనసాగుతున్న సీబీఐ విచారణ
►సీబీఐ టీమ్‌ను లీడ్ చేస్తున్న రాఘవేంద్ర వత్స
►సీబీఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ
11:28AM
►సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత విచారణ
►సీబీఐ బృందంలో 11మంది అధికారులు
►కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు
11:11AM
►ప్రారంభమైన కవిత సిబిఐ విచారణ
►సిబిఐ ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ప్రశ్నావళిని ముందుంచి ప్రశ్నించే అవకాశం
►మొదటి రోజు ఓరల్ విచారణ
►కొన్ని డాక్యుమెంట్లు, కాల్ లిస్ట్ పై ప్రశ్నించనున్న అధికారులు
►సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో కవితను విచారించనున్న సిబిఐ
10:51AM
కవిత నివాసానికి చేరుకున్న డిల్లీ సిబిఐ అధికారులు
►మహిళా అధికారులతో సహా ఆరుగురు అధికారులు
►న్యాయనిపుణుల సమక్షంలో విచారించాలని కోరే అవకాశం
►ఇప్పటికే చేరుకున్న న్యాయవాదులు
►160 సీఆర్‌పీసీ నోటీస్ కింద విచారణ
►గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రత్యేక గదిని సిద్దం చేసిన సిబ్బంది
10:38AM
►మరికాసేపట్లో కవిత నివాసానికి రానున్న సిబిఐ బృందం
►సిబిఐ గెస్ట్ హౌస్ నుంచి కవిత నివాసానికి బయల్దేరిన ఢిల్లీ సీబీఐ టీం.
►మూడు వెహికల్స్ లో బయలు దేరిన అధికారులు
►ఢిల్లీ మద్యం కేసులో కవిత స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సిబిఐ బృందం
►కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు
►ఎయిర్పోర్ట్ నుంచి తమ అధికార గెస్ట్ హౌస్ లో దిగిన సిబిఐ టీమ్స్
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై నమోదు చేసిన కేసులో.. ఈ రోజు(ఆదివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించనుంది. ఈ నెల 11న విచారణకు తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత తెలియజేయగా, సీబీఐ కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాసం ప్రాంగణం బోసిపోయింది.
భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు..
మరోవైపు పార్టీ శ్రేణులు వారం రోజులుగా పెద్ద ఎత్తున బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో పోలీసులు అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్’(యోధుడి కుమార్తె.. ఎప్పుడూ భయపడదు), ‘వుయ్ ఆర్ విత్ యూ కవితక్కా..’(మేము నీతో ఉన్నాం కవితక్కా..) అంటూ కవిత నివాస పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇలావుండగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేసినందుకు గాను కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈఓ, పూజారులు కవితకు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
తెలంగాణాలో ప్రకపంనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం
►లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులిచ్చిన సీబీఐ
►160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ
►ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్టైన తెలంగాణాకు చెందిన అభిషేక్ బోయినపల్లి
►ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు
►గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగే మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పాలసీని మార్చిన ఢిల్లీ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment