సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే అరెస్టు అయిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అభిషేక్ రావు తదితరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది. మద్యం విధానం, లైసెన్స్‌ల వ్యవహారంపై సీబీఐ ఫోకస్ పెట్టింది.
ప్రధానంగా ఆరు అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారు.
1. మద్యం విధాన మార్పులలో అవకతవకలు
2. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చడం
3. లైసెన్సు ఫీజులు మినహాయించడం లేదా తగ్గించడం
4. అనుమతి లేకుండా ఎల్ -1 లైసెన్సులు పొడిగించడం
5. అక్రమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వ అధికారులకు చెల్లించడం
6. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఖాతా పుస్తకాలలో తప్పుడు ఎంట్రీలు రాయడం.
చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment