
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన వివరణ ఇవ్వడానికి డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు సిద్ధమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి ఆరోజున అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు.
కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్‌పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో అధికారులు మరో రోజు విచారణకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment