
సాక్షి, న్యూఢిల్లీ : సెలవుపై పంపిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను తిరిగి సీబీఐ చీఫ్‌గా నియమించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ప్రముఖ కాంగ్రెస్ నేతలు నిరసనల్లో పాల్గొంటారు. రాష్ట్ర రాజధానుల్లోని సీబీఐ కార్యాలయాల ఎదుట పార్టీ రాష్ట్ర చీఫ్‌లతో పాటు, రాష్ట్రస్ధాయి నేతలు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గంటారు.
సీబీఐ డైరెక్టర్‌ను అక్రమంగా, రాజ్యాంగవిరుద్ధంగా సెలవుపై పంపడం పట్ల ప్రధాని మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతిష్ట్మాతక దర్యాప్తు ఏజెన్సీలో వివాదాలతో కీచులాడుకుంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం రాత్రికి రాత్రి సెలవుపై పంపిన సంగతి తెలిసిందే.
వర్మ స్ధానంలో తెలుగు వ్యక్తి ఎం నాగేశ్వరరావును నూతన సీబీఐ చీఫ్‌గా కేంద్రం నియమించింది. మరోవైపు తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment