సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించి సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అలోక్ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు విచారిస్తూ కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.