న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో చోటుచేసుకుంటున్న అవినీతి బయటపడుతున్నందున భయంతోనే అలోక్‌ను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రఫేల్ కుంభకోణానికి సంబంధించిన దస్త్రాలను అలోక్ సేకరిస్తున్నందునే ఆయనపై వేటు పడిందన్నారు. రాహుల్ ఓ ట్వీట్ చేస్తూ ‘ప్రధాని సందేశం చాలా స్పష్టంగా ఉంది. రఫేల్‌కు ఎవరు దగ్గరగా రావాలని ప్రయత్నించినా వారు పదవి కోల్పోతారు. తుడిచిపెట్టుకు పోతారు’ అని ఆరోపించారు. దేశం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ‘రఫేల్‌లో ఫోబియా’ కారణంగానే అలోక్‌ను మోదీ తప్పించారన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మాట్లాడుతూ.. మోదీకి ఇష్టుడైన అస్థానాను కాపాడటం కోసమే అలోక్‌ను కూడా కేంద్రం తప్పించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment